ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకూడదు.. చేశారంటే ?

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి శరీరంపై, ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.కేవలం కరోనా సమయం అనే కాకుండా మన శరీరాన్ని, శరీర భాగాలపై ఎల్లప్పుడు శ్రద్ధ కనబరచాలి.

 Healthy Life,fast Food,leftover Food,cell Phones, Tv,smoking,health Problems, He-TeluguStop.com

మనం తీసుకునే ఆహార అలవాట్లను బట్టి మన ఆరోగ్యం ఉంటుంది.ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా పౌష్టికాహారం తినడం పక్కన పెట్టి, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జింక్ ఫుడ్ లకు అలవాటు పడుతున్నారు.

దీని ఫలితంగా శరీర బరువు పెరగడంతోపాటు, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

బయట దొరికే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం ద్వారా కొంతమందిలో అల్సర్లు, కడుపు ఉబ్బరం, గొంతులో మంట ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు.

ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా, మన ఆరోగ్యంపై దృష్టిసారించి అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే ఈ పనులను అసలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ప్రస్తుతం మనం ఏ పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం…

Telugu Cell, Fast, Problems, Healthy, Leftover-Telugu Health - తెలుగ

*చాలామంది ఉదయం లేవగానే అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు.అలా చేయడం వల్ల మన పొట్టగాయపడుతుంది.అంతేకాకుండా కొద్దిమంది తక్కువ పరిమాణంలో నీటిని తీసుకుంటారు.

అలాంటి వారిలో కిడ్నీ సంబంధిత సమస్యలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

* కొద్దిమంది మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరుచుకుని మరలా తింటూ ఉంటారు.

అలా తినడం వల్ల చిన్న ప్రేగులు దెబ్బ తింటాయి.కొందరి ఇళ్ళల్లో ఎక్కువగా వేయించుకుని, కారం ఉప్పు ఎక్కువగా తింటూ ఉంటారు.అలాంటి వారిలో పెద్ద పేగులో సమస్యలు ఎదురవుతాయి.

*పొగతాగే వారి విషయంలో ఎక్కువగా పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లుతుంది.

కేవలం తాగేవారు మాత్రమే కాకుండా ఆ వాతావరణంలో పెరిగే వారికి కూడా ఈ ఊపిరితిత్తులకు సంబంధించి నటువంటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

*కొంతమంది సెల్ ఫోన్లను, టీవీ, కంప్యూటర్ స్క్రీన్లను చీకటి గదిలో చూస్తూ ఉంటారు.

అలా చూడడం వల్ల కళ్ళు గాయపడటమే కాకుండా, ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు మన మెదడు గాయపడుతుంది.ప్రతిరోజు ఈ చిన్నపాటి పనులను చేయకుండా ఉండటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన దరిచేరకుండా ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube