పర్సనల్ లోన్ కావాలా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే..??

If You Want A Personal Loan But Beware

అవసరాల కొద్ది డబ్బులు అంటారు మన పెద్దవాళ్ళు.మన అవసరానికి మించి ఖర్చులు పెడితే ఎన్ని డబ్బులు ఉన్నాగాని చాలవు.

 If You Want A Personal Loan But Beware-TeluguStop.com

అయితే కొంతమంది వచ్చే జీతం చాలాకో లేక మరే అవసరాల కోసమో పర్సనల్ లోన్ తీసుకుంటారు.ఒక్కో బ్యాంకులో ఒక్కోలాగా పర్సనల్ లోన్ పై వడ్డీలు ఉంటాయి.

అన్ని బ్యాంకులలో కూడా ఒకేలాగా వడ్డీలు ఉండవు.బ్యాంకుని బట్టీ పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు అనేది మారుతూ ఉంటుంది.

 If You Want A Personal Loan But Beware-పర్సనల్ లోన్ కావాలా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవేళ మీరు కనుక పర్సనల్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే మరి ఏ బ్యాంక్ లో పర్సనల్ లోన్ పై ఎంత వడ్డీ పడుతోంది అనే విషయాలు ముందుగా తెలుసుకోండి.పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మీరు వినే ఉంటారు.

పర్సనల్ లోన్స్ తీసుకుంటే వాటి మీద వడ్డీ కింద 9.05% గా వసూలు చేస్తున్నారు.అలాగే ప్రోసెసింగ్ ఫీజు కూడా తగ్గింపు ఉంది.అలాగే ఇండియన్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్ పై వడ్డీ రేటు 9.05% ఉండగా దీని ఈఎమ్ఐ రూ.10,391కి కట్టాలి.అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అయితే ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం ఇస్తున్నారు.దీనికోసం గాను 8.9% వడ్డీ మీరు చెల్లించాలిసి ఉంటుంది.

ఇకపోతే మీ ఈఎమ్ఐ విషయానికి వస్తే రూ.10,355 దాక కట్టాలి.అలాగే ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో అయితే పెర్సనల్ లోన్ పై సంవత్సరానికి 9.45 % వడ్డీ రేటు ఉంటుంది.అలాగే బ్యాంక్ ఈఎమ్ఐ చూస్తే రూ.10,489 గా ఉంది.కాగా పంజాబ్ & సింధ్ బ్యాంక్, IDBI బ్యాంక్ లలో ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే ఆ వ్యక్తిగత రుణాలపై 9.5% వడ్డీ రేటు వర్తిస్తుంది.అలాగే ప్రతి నెలా రూ.10,501 ఈఎమ్ఐ చెల్లించాలిసి ఉంటుందిచూసారు కదా ఏ ఏ బ్యాంకులలో ఎంత ఎంత వడ్డీ పడుతుందో ఆ వడ్డీ రేట్లను బట్టి మీ పర్సనల్ లోన్స్ ను ప్లాన్ చేసుకోండి.

#Personal Loan #Intrst

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube