ఆ మూడు ఎజెండాల‌తో యాత్ర‌లు చేస్తేనే చంద్ర‌బాబు స‌క్సెస్..

ఏపీలో టీడీపీని గ‌ట్టెక్కిచాలంటే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం ఒక్క‌టే మార్గం అని చంద్ర‌బాబు భావిస్తున్నారు.ఇందుకోసం ఇప్ప‌టికే అన్ని ర‌కాలుగా ప్లాన్లుకూడా వ‌స్తున్నారు.

 If You Travel With Those Three Agendas, Chandrababu Will Be Successful Chandraba-TeluguStop.com

తాను గ‌తంలో చేసిన పాద‌యాత్ర కార‌ణంగానే న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం ద‌క్కించుకున్నారు అయితే ఆ త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ పాద‌యాత్ర చేసి త‌న ప‌ట్టును నిల‌పుకోవాల‌ని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని చూస్తున్నారు చంద్ర‌బాబు.ఈసారి కూడా రాయ‌ల‌సీమ నుంచే త‌న పాద‌యాత్ర‌ల‌ను ప్రారంభించి అధికారంలోకి రావాల‌ని ప‌ట్టుమీద ఉన్నారు చంద్ర‌బాబు.

ఇక ఈసారి కూడా గ‌తంలో లాగానే అనంతపురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచే ప్రారంభించి మ‌ళ్లీ హ‌వాను కొన‌సాగించాల‌ని ప్లాన్లు వేసుకుంటున్నారు.కాగా ఆయ‌నకు వ‌య‌సు భారం కార‌ణంగా పాద‌యాత్ర‌ల‌ను ప్లాన్ చేసుకుంటారా లేదంటే బస్సు యాత్రకు ప‌రిమితం అవుతారా అన్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే ఈయ‌న యాత్ర‌పై ఇప్పుడు టీడీపీ సీనియ‌ర్లు మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.అస‌లు ఎలాంటి అజెండాల‌పై యాత్ర చేస్తు వ‌ర్కౌట్ అవుతుంద‌నే దానిపై మంత‌నాలు జ‌ర‌పుతున్నారు సీనియ‌ర్లు.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Travel Agendas, Ysrcp-Telugu Political News

జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తే వ‌ర్కౌట్ కాద‌ని ఆయ‌న‌పై ఆ స్థాయిలో వ్యతిరేకత లేద‌నేది టీడీపీ మేధావుల అభిప్రాయం.అందుకే ఆయ‌న‌పై ఏ అజెండాలు ప‌నిచేస్తాయో వాటిమీద వెళ్తేనే ప్ర‌య‌జ‌నం ఉంటుంద‌ని తెలుస్తోంది.కాబ‌ట్టి ముఖ్యంగా మూడు అంశాలైన రాజధాని, అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు అనే మూడు పెద్ద అంశాల‌ను అజెండా మార్చుకుని వాటిని బ‌లంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఆయ‌న పార్టీకి మ‌ద్ద‌తు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.జ‌గ‌న్ పాల‌న‌లో ఈ మూడు అంశాల‌ను అభివృద్ది చేయ‌లేద‌నే నినాదాన్ని బ‌లంగా తీసుకెళ్లాల‌ని చూస్తున్నారు.పైగా ఈ మూడు అంశాల‌పై జ‌గ‌న్‌మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కూడా ఉండ‌టం టీడీపీకి క‌లిసి వ‌చ్చే అంశం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube