నుపుర్ శర్మకు మద్దతిస్తే అంతే..వామ్మో ఇంత దారుణమా..?

నుపుర్ శర్మను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు రాజస్థాన్ లో ఓ టైలర్‌ను నరికి చంపిన ఘటన మరువకముందే అలాంటిదే మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు షేర్ చేసినందుకు మహారాష్ట్రలో ఓ మెడికల్ షాపు యజమానిని దుండగులు కత్తితో నరికి చంపారు.

 If You Support Nupur Sharma That's All Is It That Bad , Nupur Sharma, Irrfan, Pr-TeluguStop.com

జూన్ 21న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది.ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కీలక నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకు కేంద్రం అప్పగించింది.ఈ హత్యకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారంతా దినసరి కూలీలని పోలీసులు తెలిపారు.అసలు నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.అసలు నిందితుడు దొరకనందున హత్యకు గల కారణాలు ఇప్పుడే చెప్పలేమని అమరావతి పోలీస్‌ కమిషనర్‌ ఆర్తి సింగ్‌ తెలిపారు.

ఆ హత్యకు వారం రోజుల ముందే మహారాష్ట్రలో డ్రగ్గిస్ట్ ప్రహ్లాద్‌ రావు హత్య జరిగింది.ఈ కేసులో కీలక నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ కోసం గాలింపు చేపట్టినట్టు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ స్వచ్చంద సంస్థను నడుపుతున్నాడని పోలీస్ కమిషనర్ తెలిపారు.54 ఏళ్ల ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే అమరావతిలో ఓ మెడికల్ షాప్ నడుపుతున్నారు.ఆయన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్టు షేర్ చేశారు.ఆ పోస్టును పొరపాటున ప్రహ్లాద్ రావు ఓ వాట్సాప్ గ్రూపుకి ఫార్వార్డ్ చేయడం హత్యకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు.

Telugu Irrfan, Nupur Sharma, Prahlad Rao, Umeshprahlad-Latest News - Telugu

ప్రహ్లాద్ రావును హత్య చేయడానికి ఇర్ఫాన్ కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు.దీని కోసం ఐదుగురు వ్యక్తులను ఇర్ఫాన్ నియమించాడని, వారికి పదివేలు ఇస్తానని అతను చెప్పాడని పోలీసులు వెల్లడించారు.హత్య అనంతరం కారులో పారిపోయేందుకు కూడా ఏర్పాట్లు చేశాడని పోలీసులు వివరించారు…జూన్ 21న ప్రహ్లాద్ రావు తన మెడికల్ షాపును మూసివేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.ఆ సమయంలో ప్రహ్లాద్‌రావు భార్య, కుమారుడు మరో ద్విచక్ర వాహనంపై ప్రహ్లాద్ రావు వెనకే వెళుతున్నారని పోలీసులు తెలిపారు.

అదే సమయంలో దుండగులు రెండు మోటార్ సైకిళ్లపై ప్రహ్లాద్ రావుని వెంటాడి కత్తులతో దాడి చేసి చంపారు.ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.అనంతరం ప్రహ్లాద్‌రావును అతని కుమారుడు ఆస్పత్రికి తరలించాడు.అయితే, అప్పటికే ప్రహ్లాద్ రావు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.

ప్రహ్లాద్ రావును హత్య చేయడానికి దుండగులు వాడిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube