ఆ సమయంలో సిగరెట్ తాగితే ఒక పది సిగరెట్లు తాగిన దానితో సమానమట!

సిగరెట్ తాగటం అనేది ఎంత ప్రమాదకరమో మీకు తెలియంది కాదు.ఇది మద్యపానం కంటే అనారోగ్యగమని చెబుతూ వుంటారు.

 If You Smoke A Cigarette At That Time, It Is Equivalent To Smoking Ten Cigarette-TeluguStop.com

అయితే ముఖ్యంగా సిగరెట్ తాగేవారు అనేక పద్ధతులను అవలంబిస్తూ వుంటారు.వీరు ముఖ్యంగా భోజనం చేయగానే సిగరెట్ తాగటం, అలాగే బాత్ రూమ్ కి వెళ్ళేటప్పుడు తమ వెంటే సిగరెట్ ప్యాక్ ని పట్టుకొని పోతుంటారు.

ఇలాంటి అలవాట్లను మనం సహజంగా చాలా మందిలో చూస్తుంటాం.అయితే ఇలా చేయటం మంచిదేనా? భోజనం చేయగానే ఆచరించే కొన్ని అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం.

భోజనం చేసిన తరువాత సిగరెట్ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది.ఇలా తాగటం ససేమిరా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.భోజనం చేసిన వెంటనే తాగిన ఒక సిగరెట్ పది సిగరెట్లకు సమానం అవుతుందని అంటున్నారు.పేగులపై అది విపరీత ప్రభావాన్ని చూపుతుంది.కాబట్టి… భోజనం తరువాత సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు దానిని వెంటనే మానేయటం ఉత్తమం అని చెబుతున్నారు.అలాగే బూత్ రూములో హాయిగా సిగరెట్ తాగుతూ పని కానిచ్చేస్తూ వుంటారు చాలామంది.

ఇది కూడా చాలా అనారోగ్యకారకమని అంటున్నారు.

అంతేకాకుండా చాలామంది నిద్రపోయే ముందు కూడా సిగరెట్ వెలిగిస్తారు.

ఇది కూడా చాలా దోషమని అంటున్నారు.ఇలా పొగ తగినట్లైతే.

నిద్రలో వున్నపుడు తాగిన పొగ వివిధ అవయవాల పనితీరుపైన ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.అందువల్లనే కాలేయ కేన్సర్ వంటి రోగాలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయని చెబుతున్నారు.

కాబట్టి పొగ తాగే అలవాటు వున్నవారు ఈ విషయాలు పరిగణనలోకి తీసుకొని మసలుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.అలాగే మనలో చాలామంది భోజనం చేసినవెంటనే స్నానం చేస్తూ వుంటారు.

అది కూడా మంచిది కాదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube