ప్లాస్టిక్ బాటిల్స్ పై వీటిని గమనించారా? వీటి ద్వారా ఏ బాటిల్ సేఫ్,ఏది డేంజర్ ఈజీగా తెలుసుకోవచ్చు.     2018-09-19   12:48:05  IST  Rajakumari K

బయటికి వెళ్లినప్పుడు పొరపాటున ఇంటి నుండి వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోతే అంతే సంగతులు..బయట ఎక్కడైనా వాటర్ తాగాలంటే ఎంతో ఆలోచిస్తాం..లేదంటే గతంలోలా కొన్ని మంచినీళ్లివండమ్మా అంటే ఇచ్చే వారు కరువయ్యారు..దాంతో గత్యంతరం లేక నీళ్లు కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి..ఆ నీటిని కొనేప్పుడు కూడా మినరల్ వాటరా కాదా అని చూసి కొంటాం.. నీరు శుభ్రంగా ఉందా లేదా అని చూస్తాం తప్ప..బాటిల్ ని గమనించం..అయితే మన ఆరోగ్యానికి సంభందించిన విషయం కాబట్టి బాటిల్ పై ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సిందే..అదేంటంటే..

ఇక‌పై మీరు వాట‌ర్ బాటిల్‌ను కొని తాగడానికి ముందు దాని కింద భాగాన్ని ఒక‌సారి చూడండి. ఏం క‌నిపిస్తాయి..? ప‌రిశీలించారా..? అయితే జాగ్ర‌త్త‌గా చూడండి..! PP, HDPE, HDP, PETE, PET, PVC, LDPE అని ఏవైనా ఆంగ్ల అక్ష‌రాలు క‌నిపిస్తున్నాయా..? అవును, క‌నిపిస్తాయి. ఇంత‌కీ అవి ఎందుకు ప్రింట్ చేయ‌బ‌డి ఉంటాయో తెలుసా..? ఆ వాట‌ర్ బాటిల్ త‌యారు చేయ‌బ‌డిన ప్లాస్టిక్ ప‌దార్ధం అది. అంటే… ఎన్నో ర‌కాల ప్లాస్టిక్స్ ఉన్నాయి క‌దా. వాటిలో ఏ త‌ర‌హా ప్లాస్టిక్‌తో ఆ వాట‌ర్ బాటిల్‌ను త‌యారు చేశారో తెలియ‌జేస్తూ బాటిల్స్ కింద దానికి చెందిన లెట‌ర్స్‌ను ప్రింట్ చేస్తారు. మ‌రి వాటిలో మ‌న‌కు ఏది సేఫో, ఏది హాని క‌లిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

If You See Those Markings At The Bottom Of Your Bottles, Be CAREFUL-Bottles,HDPE,If You See Those Markings At The Bottom Of Your Bottles,PETE,PVC,Types Of Bottiles,Which Plastics Is Safe To Use For Us

PETE లేదా PET …

వాట‌ర్ బాటిల్ కింద గ‌న‌క ఈ లెట‌ర్స్ ప్రింట్ చేయ‌బ‌డి ఉంటే జాగ్ర‌త్త‌. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తో త‌యారు చేసిన వాట‌ర్ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్ర‌మాద‌క‌ర‌మైన విష ప‌దార్థాలు విడుద‌లవుతాయ‌ట‌. ఆ క్ర‌మంలో ఆ నీటిని తాగ‌డం మనకు మంచిది కాద‌ట‌.

If You See Those Markings At The Bottom Of Your Bottles, Be CAREFUL-Bottles,HDPE,If You See Those Markings At The Bottom Of Your Bottles,PETE,PVC,Types Of Bottiles,Which Plastics Is Safe To Use For Us

HDPE లేదా HDP…

వాట‌ర్ బాటిల్ కింద గ‌న‌క ఈ లెట‌ర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్‌లోని నీటిని మ‌నం నిర‌భ్యంత‌రంగా తాగ‌వ‌చ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవ‌శేషాలు చేర‌వు. అవి పూర్తిగా సుర‌క్షిత‌మైన‌వి. మ‌న‌కు ఎలాంటి హాని క‌లిగించ‌వు.

If You See Those Markings At The Bottom Of Your Bottles, Be CAREFUL-Bottles,HDPE,If You See Those Markings At The Bottom Of Your Bottles,PETE,PVC,Types Of Bottiles,Which Plastics Is Safe To Use For Us

PVC లేదా 3V …

ఈ లెట‌ర్స్ వాట‌ర్ బాటిల్స్ కింద ప్రింట్ చేయ‌బ‌డి ఉన్నా జాగ్ర‌త్త‌గా చూడాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వ‌ల్ల నీటిలోకి కొన్ని ర‌కాల విష ప‌దార్థాలు చేర‌తాయి. అవి మ‌న శ‌రీరంలో హార్మోన్ అస‌మ‌తుల్య‌త‌ను క‌లిగిస్తాయి.

If You See Those Markings At The Bottom Of Your Bottles, Be CAREFUL-Bottles,HDPE,If You See Those Markings At The Bottom Of Your Bottles,PETE,PVC,Types Of Bottiles,Which Plastics Is Safe To Use For Us

LDPE …

ఈ ప్లాస్టిక్‌తో చేసిన వాట‌ర్ బాటిల్స్ మ‌న‌కు శ్రేయ‌స్క‌ర‌మే. వీటి నుంచి ఎలాంటి వ్య‌ర్థాలు నీటిలోకి చేర‌వు. కానీ ఈ ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్ త‌యారీకి ప‌నికిరాదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ ను దీంతో చేస్తారు.

PP…

పెరుగు క‌ప్పులు, టానిక్‌లు, సిర‌ప్‌లు ఉంచేందుకు వాడే చిన్న‌పాటి బాటిల్స్‌ను త‌యారు చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ను వాడుతారు. ఇది మ‌న‌కు సుర‌క్షిత‌మే.

PS…

ఈ త‌ర‌హా ప్లాస్టిక్‌తో కాఫీ, టీ క‌ప్స్ త‌యారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్ స‌మ్మేళ‌నాల‌ను విడుద‌ల చేస్తాయి. క‌నుక ఈ త‌ర‌హా ప్లాస్టిక్‌తో చేసిన వ‌స్తువుల‌ను కూడా వాడ‌కూడ‌దు.

If You See Those Markings At The Bottom Of Your Bottles, Be CAREFUL-Bottles,HDPE,If You See Those Markings At The Bottom Of Your Bottles,PETE,PVC,Types Of Bottiles,Which Plastics Is Safe To Use For Us

లేబుల్ ఏం లేక‌పోయినా లేదా PC అని ఉన్నా…

ఈ ప్లాస్టిక్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంది. దీంతో చేసిన ఏ ప్లాస్టిక్ నూ వాడ‌కూడ‌దు. చాలా ప్ర‌మాద‌క‌రం. కానీ కొంద‌రు ఈ ప్లాస్టిక్‌తోనే ఫుడ్ కంటెయిన‌ర్లు, వాట‌ర్ బాటిల్స్‌ను త‌యారు చేస్తున్నారు. క‌నుక మీరు వాడుతున్న ప్లాస్టిక్ వ‌స్తువులు దీంతో గ‌న‌క త‌యారై ఉన్నాయో లేదో ఒక‌సారి చెక్ చేసుకోండి..!

Attachments area