Lakshmi devi : వీటిని ప్రతిరోజు చూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటిపై ఉంటుందా..

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే ఏ పని లేదా ఇంట్లో ఏ వస్తువునైనా వాస్తు ప్రకారం అమర్చితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని కూడా ఎక్కువగా నమ్ముతారు.

అందుకోసం వారు ఏ పనిలోనైనా కచ్చితంగా వాస్తు చూసే చేస్తారు.దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరంగా వెళుతుందని ఎక్కువగా నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే వాస్తు పండితులే ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతూ ఉన్నారు.ఆ విషయాలను తెలుసుకుని మనం తప్పకుండా అనుసరిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఆ ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి.అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉండే అవకాశం ఉంది.

Advertisement

అంతేకాకుండా ప్రతిరోజు వాడిపోయిన పూలని లేదా ఎండిపోయిన పూలను తీసివేయడం లాంటివి కూడా చేస్తూ ఉండాలి.చాలామంది ప్రజలు దేవుడికి పూలను పెట్టి వాటిని చాలా రోజుల దాకా తొలగించకుండా అలాగే ఉంటారు.

అలా ఉంచడం అంత మంచిది కాదు.ఒకరోజు పెట్టిన పూలు వెంటనే మరుసటి రోజు తీసేయాలి.

లేదంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షి గూడు కడితే మంచి జరిగే అవకాశం ఉంది.బాల్కనీలో కానీ పక్షి గూడు కట్టిందంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఉంది.తరచూ మన ఇళ్లలో బల్లులు కనబడుతూ ఉంటాయి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!

బల్లులు కనబడడం కూడా ఆ ఇంటికి ఎంతో మంచిది.చాలా మంది బల్లులను చూసి అసహ్యించుకుంటూ ఉంటారు.

Advertisement

కానీ బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై ఉండే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అదేవిధంగా కుక్క బెడ్ ముక్కని నోట్లో పెట్టుకుని పరిగెత్తి వెళ్లిపోవడం చూస్తే మనకు అదృష్టం కలుగుతుందట.

అంతేకాకుండా ఆ ఇంటి కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండే అవకాశం ఉంది.

తాజా వార్తలు