బెంగుళూరులో నిధి అగర్వాల్ ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించింది కొన్ని సినిమాలలో అయినప్పటికీ తన గ్లామర్ ద్వారా ఎంతో మందికి ఆకట్టుకొని పలు సినీ అవకాశాలను దక్కించుకుంటున్నారు.కెరియర్ మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘మున్నా మైఖేల్‌’అనే చిత్రం ద్వారా అడుగుపెట్టిన ఈ స్మార్ట్ బ్యూటీ తెలుగులో “సవ్యసాచి” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

 If You See Nidhi Agarwal House In Bangalore You Should Be Shocked, Nidhi Agarwal-TeluguStop.com

అయితే మొదటి సినిమా పెద్దగా గుర్తింపు తీసుకు రానప్పటికీ ఆ తర్వాత “మిస్టర్ మజ్ను” కూడా తనకు తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పవచ్చు.ఇక టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” సినిమా ఈమె కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారిందని చెప్పవచ్చు.

“ఇస్మార్ట్ శంకర్”సినిమాలో కాస్త గ్లామర్ జోడించి చేసిన ఈ భామ ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న”హరహర వీరమల్లు” చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా ఎక్కువ సేపు తన ఇంటిలో గడపడానికి సమయం కేటాయిస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బెంగుళూరు లో ఉన్నటువంటి తన ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

బెంగళూరులో నిధి అగర్వాల్ ఇంటిని చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.ఎంతో విలాసవంతమైన ఇంటినీ చక్కని ఇంటీరియర్ డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ తన పెట్స్ తో ఆడుకుంటూ లివింగ్ ఏరియాకు సంబంధించిన ఫోటోలను, తన బెడ్ రూమ్, ఇక కిచెన్ కి సంబంధించిన ఫోటోలను ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం నిధి ఇంటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఇస్మార్ట్ బ్యూటీ బ్యూటిఫుల్ హౌస్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube