వావ్‌.. తాతకు ఈ కోతి ఎలా సాయం చేసిందో చూస్తే ఫిదా అయిపోతారు..

If You See How This Monkey Helped Grandpa You Will Be Fed Up

సాయం చేయాల‌నే ఆలోచ‌న చాలా గొప్ప‌ది.అది చిన్న‌దా పెద్ద‌దా అని కాకుండా దాన్ని ఆచ‌రించి చూపెట్టేవారు ఆ సాయం పొందిన‌వారి గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతారు.

 If You See How This Monkey Helped Grandpa You Will Be Fed Up-TeluguStop.com

త‌మ‌కు సాయం చేసిన వారు చిన్న‌వారైనా లేదా పెద్ద వారైనా స‌రే వారిని అత్యంత గౌర‌వంగా చూస్తారు.ఎందుకంటే మ‌నం బాగున్న‌ప్పుడు పొగిడే వారి క‌న్నా ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు సాయం చేసే చేతులు చాలా గొప్ప‌వి.

అయితే మ‌నుషులు మ‌నుషుల‌కు సాయం చేయ‌డం మ‌నం చూస్తున్నాం.అదే మ‌నుషులు అప్పుడ‌ప్పుడు జంతువుల‌కు సాయం చేయ‌డాన్ని కూడా మ‌నం చూస్తున్నాం.

 If You See How This Monkey Helped Grandpa You Will Be Fed Up-వావ్‌.. తాతకు ఈ కోతి ఎలా సాయం చేసిందో చూస్తే ఫిదా అయిపోతారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కోతులు మ‌నుషుల‌కు సాయం చేయ‌డం మీరెప్పుడైనా చూశారా చూడ‌కుంటే మాత్రం ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోను చూస్తే మీరు కూడా వావ్ అంటారేమో.సాధార‌ణంగా కోతుల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగానే వైర‌ల్ అవుతాయి.

కానీ అందులో చాలా వ‌ర‌కు కోతి చేష్ట‌ల‌కు సంబంధించిన‌వే ఉంటాయి.కానీ ఇప్పుడు మాత్రం ఓ కోతిఎంతో బాధ్య‌తాయుతంగా ప్ర‌వ‌ర్తించిన తీరు మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ వృద్ధుడు న‌డుచుకుంటూ మెల్లి మెల్లిగా వెళ్ల‌డం మ‌నం చూడొచ్చు.

అయితే ఆ తోవ ప‌క్క‌న కోతి చేతిలో కర్ర ఉంది.ఇక ఆ వృద్ధుడికి క‌ర్ర సాయం కావాల్సి వ‌చ్చింది.న‌డిచేందుకు క‌ర్ర‌ను తీసుకోవాల‌నుకున్నాడు.

ఇక ఆ వృద్ధుడు ఆ చేతిక‌ర్ర‌ను ఇవ్వాలంటూ దాన్ని అడుగుతాడు.కానీ కోతి ఏ మాత్రం దాడికి దిగ‌కుండా త‌న చేతిలో ఉన్న క‌ర్ర‌ను ఎంతో గౌర‌వంగా తీసుకెళ్లి మ‌ర్యాద‌గా అత‌నికి ఇవ్వ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఇదంతా కూడా వీడియోలో రికార్డు కావ‌డంతో అంద‌రూ ఆ కోతి సాయాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు.కోతులు ఇలా కూడా ఉంటాయా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తూ ప్ర‌శంసిస్తున్నారు.

#Monkey Heped #Helped #Monkey #Nature

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube