వైరల్: రెండు చక్రాలపై అతను ఆటో నడపడం చూస్తే ఎవరయినా సరే వావ్ అనాలిసిందే..!

ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తనలోని టాలెంట్ ను బయటపెట్టి అందరిచేత శభాష్ అనిపించుకోవడంతో పాటు ఏకంగా గిన్నీస్‌ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు.

 If You See Him Driving An Auto On Two Wheels, Anyone Should Say Wow ..! Viral La-TeluguStop.com

గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు.ప్రతి ఒక్కరు కూడా గిన్నిస్ రికార్డ్ సాధించాలని ఎవరు చేయలేని సాహసాలు చేస్తూ ఉంటారు.

కానీ అది అందరి వలన సాధ్యపడదు.అయితే ఈ క్రమంలోనే ఒక ఆటో డ్రైవర్ తన ఆటో నడిపిన తీరు చూస్తే మీరే షాక్ అవుతారు.

సాధారణంగా ఆటో అనేది మూడు చక్రాలతో ఉంటుంది.కానీ ఈ వ్యక్తి మాత్రం ఆటోను కేవలం రెండు చక్రాలతో నడిపి అందరిని ఆశ్చర్యపరిచాడు.అయితే ఇది ఇప్పుడు చేసిన సాహసం కాదు.2015లో ఓ ఆటో డ్రైవర్ చేసిన సాహసం అన్నమాట.మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అలాగే ఇతను చేసిన సాహసం గిన్నీస్ బుక్ రికార్డులోకి కూడా ఏక్కింది.అసలు వివరాల్లోకి వెళితే.తమిళనాడుకు చెందిన జగదీష్ మణి అనే ఆటో డ్రైవర్ 2015లో ఆటోను రోడ్డుపై కేవలం రెండు చక్రాలపై నడిపాడు.అలా కేవలం రెండు చక్రాలతో ఆటోను 2.2 కిలోమీటర్ల దూరం నడిపాడు.అయితే ఇలాంటి ఫీట్స్ చేసిన వారు చాలామందినే ఉన్నారు కానీ 2.2 మీటర్ల దూరం నడిపిన వ్యక్తి మాత్రం జగదీష్ మాత్రమే.

అతను అలా ఆటో నడుపుతుంటే చూసే మనకు ఒకింత గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.ఎక్కడ స్కిట్ అయ్యి ఆటో పక్కకి పడిపోతుందో అని భయం వేస్తుంది.కానీ జగదీష్ మాత్రం ఎంతో చాకిచక్యంగా రెండు చక్రాలపై ఆటో నడిపి రికార్డు సృష్టించాడు.వీడియో పాతదే అయినాగాని నెట్టింట్లో మరొకమారు వైరల్ గా మారింది.అని క్యాప్షన్‌ తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ జగదీష్‌ మణి మాట్లాడుతూ.“ఇలాంటి రికార్డ్ సాధిస్తానని నేను అసలు ఊహించలేదు.నాలో ఉన్నా ప్రతిభను గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు వారు గుర్తించినందుకు వారికి నా కృతజ్ఞతలు చెబుతున్నాను అలాగే ఈ రికార్డ్ రావడం నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని జగదీష్ ఆనందం వ్యక్తం చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube