అక్కడ.... పిల్ల ని చూసి విజిల్ వేస్తే అర లక్ష ఫైన్ తప్పదట...

మామూలుగా మనుషులు ఆనందంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు ఈల వేస్తుంటారు. అయితే ఇలా వేసేటువంటి ఈలల్లో పలు రకాలు ఉంటాయి.

 If You See A Girl And Whistle You Will Be Fined In France Country, France Count-TeluguStop.com

 ఇందులో ముఖ్యంగా ఏదైనా పట్టరాని సంతోషం కలిగిన సమయంలో కొందరు ఈలలు వేస్తుంటారు. మరికొందరైతే ఎవరైనా రోడ్డు మీద అమ్మాయిని చూసినప్పుడు కొంటెగా ఈలలు వేస్తుంటారు.

అయితే ఇలా అమ్మాయిలను చూసి రోడ్లపై ఈలలు వేసేటువంటి వారికి ఆ దేశంలో దాదాపుగా 60 వేల రూపాయలు జరిమానా విధిస్తారని మీకు తెలుసా…

ఇప్పుడు అలాంటి  దేశం గురించి తెలుసుకుందాం… మామూలుగా అందరికీ దోమలు లేని దేశం ఏదంటే ముందుగా ఫ్రాన్స్ గుర్తొస్తుంది. అయితే ఈ దేశం పరిశుభ్రతకి మారుపేరు మాత్రమే కాకుండా మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కూడా ముందుంది.

ఈ దేశంలో ఎవరైనా సరే రోడ్లపై మహిళలను వేధించినా, వారితో అసభ్యకరంగా ప్రవర్తించినా, లేదా వారిని చూసి ఈలలు వేసినా వెంటనే పోలీసులు గుర్తించి జరిమానా విధిస్తారు.

ఇందులో 15 సంవత్సరాలు పైబడిన వారికైతే దాదాపుగా 66 వేల రూపాయలు జరిమానా విధిస్తారు.ఒకవేళ 15 సంవత్సరాలు లోబడిన వారికైతే 48 వేల రూపాయలు జరిమానా విధిస్తారు.ఒకవేళ పోలీసులు విధించిన జరిమానాను నిందితులు కట్టలేక పోతే వారిని అరెస్ట్ చేస్తారు.

అయితే ఆడ వాళ్ళని వేదించినందుకు గానూ ఇలాంటి జరిమానాలు విధిస్తున్నప్పటికీ మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు.దీంతో ఈ జరిమానాల వల్ల ఫ్రాన్స్ ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలను ప్రతి యేటా ఆదాయం చేకూరుతుంది.

అయితే ఈ ఫ్రాన్స్  దేశం టెక్నాలజీ పరంగా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుంది. అంతేకాక ప్రపంచంలోని 7 వింతలలో ఒకటైన ఐఫిల్ టవర్ ఈ దేశం లోనే ఉంది… ఈ దేశపు ఫోన్ నెంబర్ ముందుగా “+33” తో స్టార్ట్ అవుతుంది.

 ఈ దేశపు అధికార భాష ఫ్రెంచ్.అయితే ఈ దేశంలో దాదాపు ఏడు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube