పిల్లులను పెంచితే శృంగార సామర్ధ్యం పెరుగుతుందట! అసలు శృంగారానికి పిల్లికి వున్న లింకేమిటి?

మన దేశంలో తక్కువగాని విదేశాల్లో కుక్కలతో సమానంగా పిల్లులను పెంచుకొనే సంస్కృతిని మనం చూడవచ్చును.మనదగ్గర కేవలం కుక్క పిల్లలను మాత్రమే పెంచుకుంటారు.

 If You Raise Cats, The Sexual Ability Will Increase What Is The Link Of The Cat-TeluguStop.com

పిల్లులను పెంచుకొనేవారు ఇక్కడ చాలా తక్కువ.అయితే, పిల్లులను పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

అయితే, పిల్లులను పెంచుకోడానికి, మనుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడానికి వున్న సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? బహుశా.దీని గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు.

అసలు విషయం తెలిస్తే, మీరు కూడా పిల్లిని పెంచుకొనే ప్రయత్నం చేస్తారు.

ఫిన్‌లాండ్‌ యూనివర్శిటీ ఆఫ్ టర్కుకు చెందిన పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.

సాధారణంగా పెంపుడు జంతువుల నుంచి కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తుంటాయి.ముఖ్యంగా పెంపుడు కుక్కలు, పిల్లులు మీ గాయాలను నాకినట్లయితే.

ప్రమాదకర బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుందనే విషయం అందరికీ తెలిసినదే.అయితే, పిల్లుల్లో కనుగొన్న ఓ పరాన్నజీవి మనుషులకు చాలా మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇటీవల పిల్లులను పెంచుతున్న యజమానులను పరిశీలించిన శాస్త్రవేత్తలు.వారిలో ‘టోక్సోప్లాస్మా’ అనే పరాన్నజీవిని కొనుగొన్నారు.

టోక్సోప్లాస్మా’ ప్రమాదకర పరాన్నజీవి కాదని, పైగా దీనివల్ల వారికి ఆరోగ్యం లభిస్తుందని చెప్పడం కొసమెరుపు.

Telugu Finland Turku, Latest-Latest News - Telugu

‘టోక్సోప్లాస్మా’ను కలిగిన స్త్రీ, పురుషులిద్దరూ అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.అలాగే ఈ పరాన్నజీవి మనుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని, దీనివల్ల సాధారణ స్థాయి కంటే ఎక్కువగా శృంగారంలో పాల్గొంటారని తెలిపారు.ఈ పరాన్నజీవి కొన్ని హార్మోన్లను యాక్టీవ్ చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

పిల్లులను ఎక్కువగా పెంచుకొనే బ్రిటన్ ప్రజల్లో ‘టోక్సోప్లాస్మా’ను ఎక్కువగా కనుగొన్నారు.ఆ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ పరాన్నజీవిని కలిగివున్నారని వినికిడి.

వాస్తవానికి ఈ పరాన్నజీవి ఎక్కువగా పిల్లి మలమూత్రల్లో ఉంటుంది.వాటిని క్లీన్ చేసేప్పుడు యజమానులకు ఆ పరాన్నజీవి సంక్రమిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube