పర్సులో ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం మీ వెంటే..!

If You Put These In Your Purse You Will Be Attracted To Money

జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు.రాత్రి పగలు కష్టపడుతూ ఎన్నో డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వ మాత్రం మిగలదు.

 If You Put These In Your Purse You Will Be Attracted To Money-TeluguStop.com

ఇలాంటి సమయంలోనే ఎంతోమంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు కొందరు జ్యోతిష్య నిపుణులు వారి జాతక దోషాలు గురించి అడగడం, మరి కొందరు కొన్ని వాస్తు నియమాలను పాటించడం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ధనం ఆకర్షించడానికి, మన చేతిలో డబ్బులు నిలవడానికి కొన్ని పరిష్కార మార్గాలను పాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు.

 If You Put These In Your Purse You Will Be Attracted To Money-పర్సులో ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం మీ వెంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే మన చేతిలో డబ్బు నిలవాలంటే మన పర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవడం వల్ల డబ్బు నిలుస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మనం సంపాదిస్తున్నా డబ్బు మన దగ్గర నిలవాలంటే మన పర్సులో ఎల్లప్పుడు లక్ష్మీదేవి కూర్చుని ఉన్నటువంటి ఫోటోని పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అలాగే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వృక్షాలలో రావి చెట్టు ఒకటి.

రావిచెట్టును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునిగా భావిస్తారు.

ఇలా రావి చెట్టు ఆకును శుభ్రమైన గంగాజలంతో కడిగి ఆకుపై చందనంతో శ్రీ అని రాసి మన పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు వృధా తగ్గి మన చేతిలో డబ్బు నిలుస్తుంది.ఇలా ఈ ఆకు ఎండిపోయిన తర్వాత మరొక ఆకును తీసుకొని అదేవిధంగా మన పర్సులో పెట్టుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.అలాగే ఒక వెండి నాణెం ఎల్లప్పుడు పర్సులో ఉంచుకోవాలి.ముందుగా ఈ వెండి నాణెన్ని లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజ చేసిన అనంతరం పర్సులో పెట్టుకోవాలి.అలాగే 21 బియ్యపు గింజలను తీసుకొని వాటిని ఒక పాలిథిన్ కవర్లో వేసి పర్సులో పెట్టుకోవాలి.ఇలా కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

#Peepal Tree #Purse #Money #Siver Coins #Lakshmidevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube