మీ బ్యాంకు ఖాతాకు ఇలాంటి పాస్ వర్డ్స్ పెట్టుకుంటే ఇంకా అంతే సంగతులు అంటున్న ఎస్‌బీఐ..!

ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను అలెర్ట్ చేస్తూనే వస్తుంది.ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో ప్రజల్లో అవగాహనా కల్పించేలాగా తమ కస్టమర్లకు ముందస్తు జాగ్రత్తలు చెప్తూనే వస్తుంది.

 If You Put Such Passwords In Your Bank Account, Sbi Says The Same Thing  Sbi, Al-TeluguStop.com

అలాగే యూజర్లు తమ ఫోన్ లో పెట్టుకునే అకౌంట్‌ సంబంధిత పాస్‌వర్డ్‌ విషయంలో కూడా సైబర్ నేరగాళ్ల మోసాలు భయపడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తుంది స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా.

మొబైల్ లో పెట్టుకునే అకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, సులభమైన, బలహీనమైన, అందరికి తెలిసే అటువంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం సరికాదని సూచిస్తోంది.

సులభతరం పాస్ వర్డ్స్ పెట్టుకుంటే మీ పాస్ వార్డ్ ను కూడా సైబర్ నేరగాళ్లు హాక్ చేసే ప్రమాదం ఉంది అని సూచించారు.ఈ క్రమంలోనే సైబర్‌ నేరాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ ట్విటర్‌ ద్వారా పాస్‌వర్స్డ్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పాస్వర్డ్ అయితే మంచిదో అనే సూచనలు ఇచ్చారు.

తద్వారా మీ పాస్వర్డ్ భద్రంగా ఉంటుంది.మీ అకౌంట్‌ స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ గా ఉండాలంటే పాస్‌వర్డ్‌ లో ఆటోనీమస్ ల ఉండేలా పెట్టకూడదు అంటే ABCD, Abcd, 1234 ఇలా పాస్‌వర్డ్స్‌ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని సూచిస్తుంది.

Telugu Latest, Sbi Bank-Latest News - Telugu

అలాగే పాస్‌వర్డ్ మరింత స్ట్రాంగ్‌ గా ఉండాలంటే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ మధ్యలో యాడ్ చేయాలి.ఉదాహరణకు @, _, +, =., లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి.అలాగే ఇంగ్లిష్ లెటర్స్ తో పాటు నెంబర్స్ కూడా యాడ్ చేయాలి.

ఇంగ్లీష్ లెటర్స్ లో అప్పర్ కేస్, లోయర్ కేస్ వంటి లెటర్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.మీరు పెట్టే పాస్‌వర్డ్‌ లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండాలి అని గుర్తు పెట్టుకోండి.

ఇంకా వీలైతే 12 క్యారెక్టర్ల వరకు పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు.అలాగే మీ పాస్‌వర్డ్స్‌ లో మీ పేరు పెట్టడం, మీ డేట్ అఫ్ బర్త్ పెట్టడం లాంటివి చేయకండి.

ఈజీగా ఉండే పదాలు పెట్టడం వలన మీ పాస్‌వర్డ్స్‌ ను హ్యకర్స్ ఇట్టే పట్టేస్తారు.అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి పెట్టుకోవద్దని సూచిస్తోంది ఎస్‌బీఐ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube