ఆంజనేయుడికి ఐదు అరటి పండ్లను సమర్పిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

మంగళవారం ఆంజనేయస్వామి కి ఎంతో ఇష్టమైన రోజు.ఈ రోజు స్వామివారు ప్రత్యేక పూజలు అందుకుంటారు.

 If You Offer Five Bananas To Lord Anjaneya Do You Know What Happens, Lord Hanuma-TeluguStop.com

ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడి భక్తులలో అగ్రగణ్యుడు గా భావిస్తారు.రావణుడు సీతాదేవి ని అపహరించినప్పుడు, సీతాన్వేషణలో శ్రీరామునికి ఎంతో సహాయపడ్డారు.

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు అంజనా దేవి, కేసరి దంపతులకు జన్మించాడు.వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందు వల్ల ఆంజనేయుడు ఎంతో బలసంపన్నుడుగా అవతరించాడు.

చిరంజీవిగా ఉంటూ, నిత్యం శ్రీరామ నామస్మరణంతో శ్రీరాముని కొలుస్తూ ఉండే హనుమంతుడు మంగళవారం విశేష పూజలను అందుకుంటాడు.భక్తిశ్రద్ధలతో ఆంజనేయుడిని మంగళవారం పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల మనోధైర్యం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి, ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆ హనుమంతునికి పూజ చేసి హనుమాన్ చాలీసా పట్టించాలి.ఈ విధంగా 21 మంగళ వారాలు సూర్యోదయానికి ముందే పూజ చేయాలి.

ఆంజనేయునికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం ద్వారా ఎంతో ప్రీతి చెందుతాడు.అంతే కాకుండా కేసరిని నైవేద్యంగా స్వామివారికి సమర్పించటం ద్వారా ఆ ఆంజనేయుని అనుగ్రహం మనమీద కలుగుతుంది.

మంగళవారం పూజ చేసేటప్పుడు స్వామి వారికి బెల్లం ముక్క ను, 5 అరటి పండ్లు తమలపాకులు సమర్పించి, స్వామివారికి దీపారాధన చేయాలి.ఇలా 21 మంగళవారాలు చేయడం ద్వారా మన ఇంటిలో ప్రతికూల వాతావరణం తొలిగిపోయి, అనుకూల వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఈతిబాధలు తొలగిపోయి, ఆర్థికంగా ఎంతో రాణిస్తారు.సంతానం లేని సంతాన ప్రాప్తి కలుగుతుంది.ఉపాధి కోసం ప్రయత్నించేవారు 21 వారాలు ఆంజనేయస్వామికి ఈ విధంగా పూజించడం ద్వారా ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ వ్రతాన్ని ముఖ్యంగా పురుషులు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

If You Offer Five Bananas To Lord Anjaneya Do You Know What Happens, Lord Hanuman,ఆంజనేయ స్వామి,5 Banans,21 మంగళవారాలు,ఎర్రటి పుష్పాలతో పూజ - Telugu Banans, Lord Hanuman

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube