భారతదేశంలో ఓటు కి ఎంతో విలువ ఉంది.అప్పట్లో రాజ్యాంగ రూపు కర్త డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ నా దేశ ప్రజలకి నేను కత్తిని చేతికి ఇవ్వలేదు కానీ ఓటు హక్కు ని ఇచ్చాను. కాబట్టి ఈ దేశ అభివృద్ధి బాధ్యతలను వారే తీసుకోవాలంటూ నినదించాడు.
కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే చాలా మంది ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి పోలింగ్ బూతు కు కూడా వెళ్లడం లేదు.కానీ ఆ దేశంలో మాత్రం 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ఎన్నికల సమయంలో ఓటు వేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓటు వెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
అయితే ఆ దేశం ఏదో కాదు న్యూజిలాండ్.
ఈ దేశంలో ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి పౌరుడు కచ్చితంగా ఓటును వేసి తీరాల్సిందే. అలా కాకుండా ఎన్నికల సమయంలో ఓటు వేయలేకపోతే కోర్టులో హాజరు అయ్యి సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓటు తాను ఎందుకు వెయ్యలేకపోయాడో చెప్పిన కారణాలను కోర్టువారు నమ్మకపోతే ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారు. అంతేకాక జరిమానా కూడా విధిస్తారు.
ఒకవేళ కోర్టు విధించిన జరిమానాని కట్టలేకపోతే మరింత కాలం పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ఇలాంటి కఠిన చట్టాలను భారతదేశంలో కూడా తీసుకొస్తే కచ్చితంగా వంద శాతం పోలింగ్ నమోదవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అంతేగాక ఓటు హక్కు ప్రతి భారతదేశపు పౌరుడి జన్మ హక్కుని కాబట్టి ఇలాంటి ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకొని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే కొందరు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.