పైకి చూస్తే మిర‌ప తోట‌.. లోప‌లేమో గంజాయి ఘాటు..

అక్ర‌మార్కుల‌కు ప‌న్నెండు తోవ‌లు అంటే ఇదేనేమో అనిపిస్తుంది.ఎందుకంటే గంజాయి మీద లాభాలు సంపాదించేందుకు కొంద‌రు చేస్తున్న ప‌నులు అలా ఉన్నాయి.

 If You Look Up, There Is A Chilli Garden  A Marijuana Inside  Marijuana, Viral N-TeluguStop.com

పోలీసులు ఎన్ని దాడులు చేసినా, ఎంత‌మందిని జైలుకు పంపిస్తున్నా స‌రే.గంజాయి అక్ర‌మ ర‌వాణాలు జ‌రుగుతూనే ఉన్నాయి.

ఇక అడ‌వుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే చాలామంది గంజాయిని సాగు చేస్తూనే ఉన్నారు.ఇలా సాగు చేస్తున్న గంజాయి పంట‌ల‌ను పోలీసులు ఇప్ప‌టికే ఎన్నోసార్లు ధ్వంసం చేస్తూనే ఉన్నారు.

అయినా స‌రే తాము మాత్రం త‌గ్గేదే లే అన్న‌ట్టు త‌యార‌వుతున్నారు అక్ర‌మార్కులు.

కొంద‌రు వ్యాపారస్తులు పోలీసులు కండ్లు గ‌ప్పి గంజాయిని సాగు చేసేందుకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు.

ఏజేన్సీ ఏరియాల్లో లేదంటే రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఇలాంటి దందాల‌కు తెర లేపుతున్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి షాకింగ్ ట్విస్టు ఇచ్చారు కొంద‌రు.ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా శివారులో కొంద‌రు గంజాయి సాగు చేస్తున్న‌ట్టు ఇన్ఫ‌ర్మేష‌న్ రావ‌డంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించారు.ఇందులో విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఎందుకంటే అక్క‌డ పైకి చూస్తేనేమో మిరపతోటలే కనిపిస్తున్నాయి.

Telugu Andrapradesh, Chili Garden, Formers, Godavari, Marijuana, Drive-Latest Ne

ఈ మిర‌ప తోట‌ల్లోనే అంతర్ పంటగా గంజాయిని సాగు చేయ‌డం పోలీసుల‌కు షాక్ ఇస్తోంది.నిజానికి గంజాయిని ఇత‌ర పంట‌ల‌తో క‌లిసి అంత‌ర్ పంట‌గా ఎప్పుడూ వేయ‌లేదు.దాన్ని సెప‌రేటుగానే పండిస్తారు.

కానీ వ్యాపార‌స్తులు త‌మ తెలివితో పోలీసుల‌కే షాక్ ఇస్తున్నారు.మిరపమొక్కల న‌డుమ సాగ‌వుతున్న గంజాయి పంట‌ను పోలీసులు ధ్వంసం చేశారు.

గంజాయితో పెద్ద ఎత్తున లాభాలు వ‌స్తుండ‌టంతో రైతులు దీన్ని సాగు చేస్తున్నారంట‌.ఇదే విష‌యాన్ని పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు.

ఇలాంటి ప‌నులు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.ఇక ఆ ప్రాంత రైతుల‌కు కూడా కౌన్సెలింగ్ ఇస్తామ‌ని పోలీసులు వివ‌రించారు.

ఈ వార్త నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube