వామ్మో.. ఆమె గొంతులోంచి డాక్ట‌ర్లు ఏం తీశారో చూస్తే..

గొంతులో ఏదైనా ఇరుక్కుని పోతేనే మ‌నం చాలా విల‌విల‌లాడిపోతాం.చిన్న చిన్న వ‌స్తువుల‌కే మ‌నం ఇంత‌లా భ‌య‌ప‌డిపోతాం.

 If You Look At What The Doctors Took From Her Throat-TeluguStop.com

మ‌రి అలాంటిది గొంతులో పాములు దూరితే.విన‌డానికే చాలా భ‌యంక‌రంగా ఉంది క‌దూ.

అస‌లు మ‌న‌కు తెలియ‌కుండా మ‌న నోటిలో పాములు ఎలా దూరుతాయి అని మీరు షాక్ అయిపోతున్నారా.కానీ ఇది నిజ‌మ‌నేండి బాబు.

 If You Look At What The Doctors Took From Her Throat-వామ్మో.. ఆమె గొంతులోంచి డాక్ట‌ర్లు ఏం తీశారో చూస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ చోట ఇలాగే నోట్లోకి పాములు దూరిపోతున్నాయంట‌.విన‌డానికే చాలా విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజ‌మండి.

రష్యా దేశంలోని ఓ ఊరిలో ఇలాగే జ‌రుగుతోందంట‌.

అక్క‌డ నివ‌సించే మనుషుల గొంతుల్లోకి ఈజీగానే పాములు చొర‌బ‌డుతున్న‌ట్టు చెబుతున్నారు.

రష్యా దేశంలోని దగస్థాన్‌ అనే ఏరియాలో లెవాషి అనే విలేజ్ ఇప్పుడు ఎంతో పాపుల‌ర్ అయిపోయింది.ఎందుకంటే రీసెంట్ గా ఈ ఊరిలో ఓ మహిళ ఆరుబయట హాయిగా నిద్ర‌పోసాగింది.

ఇలా ఆమె గాఢ నిద్రలో ఉన్న‌ప్పుడు అనుకోకుండా ఆమె గొంతులోకి ఏదో వెళ్లిపోయిన‌ట్టు అనిపించింది.కానీ ఆమె లైట్ తీసుకుని ప‌డుకోగా.కొద్ది సేప‌టికి తీవ్రమైన బాధ మొద‌ల‌వ‌డంతో ఆమె వెంట‌నే త‌మ‌కు ద‌గ్గ‌ర‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Telugu Dagesthan Area, Doctors Shcoked, Four Feet Snake, Levashi Village, Russia, Snake, Snakes Found In Trroat, Snakes In Throat, Viral News-Latest News - Telugu

అక్కడ‌కు వెళ్ల‌గానే డాక్ట‌ర్లు ఆమె గొంతులో ఏముందో చూసి షాక్ అయిపోయారు.వైద్యులు ఎంతో క‌ష్ట‌ప‌డి ఆమెకు మత్తుమందు ఇచ్చి త‌మ ప‌ని మొద‌లు ఎట్టారు.ఇక ఆమె గొంతులో చొర‌బ‌డిన పామును బయటకు తీసేందుకు చాలా శ్ర‌మ‌ప‌డాల్సి వ‌చ్చింది.

చివ‌ర‌కు బ‌య‌ట‌కు తీయ‌గానే దాన్ని చూసి వైద్య సిబ్బంది వణికిపోయారంట‌.ఎందుకంటే ఆ పాము నాలుగడుగుల పొడవుతో ఉండ‌టం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

అంత పెద్ద పాము ఆమె గొంతులోకి ఎలా దూరింతో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.ఇంత‌కు ముందు కూడా ఇదే ఊరిలో ఇలాగే ఒకట్రెండు ఘ‌ట‌న‌లు వచ్చాయట.

#Levashi #Doctors Shcoked #Throat #Russia #Trroat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు