కోడి పెట్ట కోసం పుంజు ఎలాంటి ప‌ని చేసిందో చూస్తే..

If You Look At What Kind Of Work Cock Did For The Hen

సోష‌ల్ మీడియా ఇప్పుడు అంద‌రికీ చాలా ద‌గ్గ‌ర‌యిపోయింది.ఇది ద‌గ్గ‌ర‌వ‌డంతో ఒక‌ప్పుడు దూరంగా ఉన్న ప్ర‌పంచాన్ని ఇప్పుడు అర‌చేతిలోకి తెచ్చేసింది.

 If You Look At What Kind Of Work Cock Did For The Hen-TeluguStop.com

ఎక్క‌డ ఏమైనా జ‌ర‌గ‌నీ.వెంట‌నే అదిసోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం కామ‌న్ అయిపోయింది.

మొద‌టి నుంచి ఇదే తంతు జ‌రుగుతుండ‌టంతో విప‌ర‌తంగా ఈ విధ‌మైన టెక్నాల‌జీ పెరిగిపోయింది.ముఖ్యంగా జంతువుల‌కు సంబంధించిన‌వి, లేదంటే వింత‌ల‌కు, వింత ఆచారాల‌కు సంబంధించిన‌వే వైర‌ల్ కావ‌డాన్ని మ‌నం చూస్తున్నా.

 If You Look At What Kind Of Work Cock Did For The Hen-కోడి పెట్ట కోసం పుంజు ఎలాంటి ప‌ని చేసిందో చూస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైర‌ల్ వీడియోలు అంటే చాలు నెటిజ‌న్లు తెగ ఫిదా అయిపోతుంటారు.

అయితే ఇప్పుడు కూడా మ‌న‌కోసం సోషల్ మీడియా ఓ వీడియోను తీసుకొచ్చింది.

ఇందులో ఓ కోడిపెట్ట‌, పుంజు మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాన్ని మ‌నం చూడొచ్చు.కాగా ఇది మాత్రం చాలా ఫ‌న్నీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఎందుకంటే మామూలుగానే కోడిపుంజులు ఎక్కువ‌గా పెట్ట‌ల‌తోనే   తిరుగుతుంటాయి.వాటితోనే స‌న్నిహితంగా ఉంటాయి.

ఒంట‌రిగా మాత్రం అస్స‌లు తిర‌గ‌వ‌న్న విష‌యం తెలిసిందే.ఇదే విష‌యాన్ని ఓ వ్య‌క్తి ఎందుకో ప‌రీక్షించాల‌నుకున్నాడు.

పెట్ట‌ను కోడి పుంజుకు ద‌గ్గ‌ర కానివ్వ‌కుండా ఉంచేదుకు ప్ర‌య‌త్నించాడు.

అయితే అత‌ను ఎంత ప్ర‌య‌త్నించినా ఆ కోడిపుంజు మాత్రం ఆ పెట్ట ద‌గ్గ‌ర‌కు ప‌రుగులు తీస్తూనే ఉంటుంది.దీంతో పెట్టను తీసుకెళ్లి ఓ గూట్లో పెట్టి డోర్ వేయ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు.అయితే కోడిపుంజు ఏమైనా త‌క్కువ తిన్న‌దా.

వెంట‌నే అత‌ను డోర్‌కు అడ్డుగా పెట్టిన పుల్ల‌ను త‌న నోటితో తీసేసి మ‌రీ పెట్ట ద‌గ్గ‌ర‌కు చేరుకుంది.దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీసి నెట్టింట షేర్ చేయ‌గా.

నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.ఇలాంటివి చేసి ఆ అమ‌ర ప్రేమికుల‌ను విడ‌దీయ‌కండి అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొంద‌రు అయితే కోడిపెట్ట కోసం పుంజు విర‌హ వేద‌న‌తో ఉందంటూ ఫ‌న్నీగా మీమ్స్ పేల్చుతున్నారు.

#Cock #Cock Love #Animals #Cock #Cock

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube