ఆ టీకా వేసుకున్న ఆరునెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో తెలిస్తే..

If You Know What Happens Six Months After The Vaccination

కరోనా మహమ్మారి తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందనుకునే లోపే మళ్లీ విజృంభించడాన్ని మనం గమనించొచ్చు.ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా ప్రజెంట్ థర్డ్ వేవ్ అతి త్వరలో రాబోతున్నదని కొందరు, ఆల్రెడీ వచ్చేసిందని ఇంకొందరు నిపుణులు ఉంటున్నారు.

 If You Know What Happens Six Months After The Vaccination-TeluguStop.com

ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ద్వారా కొవిడ్ నియంత్రణ అవుతుందని నిపుణులే చెప్తున్నారు.దాంతో మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు తయారు చేసిన టీకాలను జనాలు తీసుకుంటున్నారు.

తద్వారా కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్, యాంటీ బాసీస్ పెరుగుతాయనేది వారి నమ్మకం.ప్రభుత్వాలు కూడా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నాయి.

 If You Know What Happens Six Months After The Vaccination-ఆ టీకా వేసుకున్న ఆరునెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ప్రజలు టీకాలు తీసుకుంటున్నారు.ఇకపోతే ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత ఏం జరుగుతుంది? అనే విషయమై కేస్ వెస్టర్న్ రిజర్వ్, బ్రౌన్ వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.ఈ స్టడీలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత యాండీ బాడీస్ కౌంట్ 80 శాతం మేర తగ్గిపోతున్నట్లు పేర్కొన్నారు.

అయితే, ఈ యాంటీ బాడీస్ తగ్గుదల అందరిలో ఒకేలా లేదట.వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత వీరిని మళ్లీ కరోనా వైరస్ అటాక్ చేసే చాన్సెస్ ఉంటాయన్న మాట.

Telugu Count, Corona Wave, Corona, Fizer, Pfizer Vaccine-Latest News - Telugu

ఇక రూపాంతరం చెందుతున్న కరోనా వేరియంట్స్ పైన వ్యాక్సిన్ ప్రభావం తక్కువగానే ఉంటుందని మనం గ్రహించాల్సి ఉంటుంది.అయితే, శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం కేవలం ఫైజర్ టీకా మాత్రమే.మిగతా వ్యాక్సిన్స్ ప్రభావం ఎలా ఉంటుందనేది వాటిపై అధ్యయనం చేస్తేనే అర్థమవుతుంది.అయితే, జనాల్లో కొవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన అయితే పెరిగింది.ప్రతీ ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అన్న సంగతి ప్రతీ ఒక్కరు గుర్తెరగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

#Corona Wave #Corona #Pfizer Vaccine #Fizer

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube