మీరు రోజూచూసే పిల్లుల‌కు సంబంధించిన ఈ సీక్రెట్స్ గురించి తెలిస్తే..

పిల్లులకు సంబంధించిన అనేక మూఢనమ్మకాలు వినేవుంటాం.కానీ పిల్లులకు సంబంధించిన చాలా విషయాలు మనకు తెలియనివి, ఆసక్తికరమైన‌వి ఉన్నాయి.

 If You Know These Secrets About Cats Details,  People ,strange Sounds, Cats, Cat-TeluguStop.com

వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.మనిషి వేళ్ల ముద్రలు ఎలా ఉంటాయో, అదే విధంగా ప్రతి పిల్లికి ముక్కు ముద్రలు భిన్నంగా ఉంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

పిల్లి ముక్కుపై ప్రింట్లు ఉంటాయి.అవి ప్రతి పిల్లికి ప్రత్యేకంగా ఉంటాయి.

వీటిని లెన్స్ ద్వారా చూడవచ్చు.పిల్లి నిద్రించడాన్ని ఇష్టపడుతుంది.

అది తన జీవితంలో మూడు వంతులు నిద్రపోతుంది. అంటే అది 24 గంటల్లో సగం కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంది.ఆడ పిల్లి ఏదైనా పని చేసినప్పుడు, ఆహారం తిన్న‌ప్పుడు, దేనిపైన‌న్నా దూసుకెళ్లాలన్నా ముందుగా తన కుడి పాదాన్ని ముందుకు వేస్తుంది.మగ పిల్లి దీనికి విరుద్ధంగా చేస్తుంది.

పిల్లి ఆహారాన్ని ఇష్టపడుతుంది.

ఆహారం నుంచి మంచి వాసన వస్తే పిల్లి మొత్తం ఆహారాన్ని తినేస్తుంది.

సువాస‌న లేకుంటే అది మంచి ఆహార‌మైనా ముట్ట‌దు.పిల్లిలో మరో ప్రతిభ కూడా ఉంది.

పిల్లి తన గొంతు నుండి 100 కంటే ఎక్కువ రకాల శబ్దాలు చేయగలదు.మియావ్ మాత్రమే కాదు, పిల్లి చాలా రకాల శబ్దాలు చేయగలదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube