వామ్మో రామ్ ధరించిన ఈ షర్ట్ ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!

ఎనర్జీ టిక్ స్టార్ రామ్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ తాజాగా లింగు స్వామి దర్శకత్వంలో దివారియర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు.

 If You Know The Price Of This Shirt Worn By Vammo Ram Dimma Will Have To Go Bac-TeluguStop.com

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ ఈయన తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసే అవకాశాన్ని అందుకున్నారు.ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది.

ఇకపోతే తాజాగా విజయవాడలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు.ఈ షాపింగ్ మాల్ కార్యక్రమంలో భాగంగా ఈయన తన స్టైలిష్ మాస్ లుక్ ద్వారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలలో భాగంగా రామ్ ధరించిన షర్ట్ ఖరీదు తెలిసి నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Boyapati, Warrior, Tollywood, Vijayawada-Movie

రామ్ ధరించిన వాటిలో పిఎస్ పాల్ స్మిత్ ఆబ్‌స్ట్రాక్ట్ ప్రింట్ షర్ట్ ఒకటి దీని ధర అక్షరాలా రూ.18,500.ఇక షూస్ క్రిస్టియన్ లౌబౌటిన్ లూయిస్ స్పైక్స్.దీని ధర రూ.77,036 ఇలా బ్రాండెడ్ వస్తువులను ధరించి రామ్ కిరాక్ లుక్ లో కేక పెట్టిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే చాలా కాలం నుంచి హిట్టు లేక సతమతమవుతున్న రామ్ కి పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ పెట్టి ఇచ్చారు.ఈ సినిమా అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ రామ్ ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube