ఆ సాండ్‌విచ్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సాధారణంగా మనకు లభించే శాండ్ విచ్ ల ధర ఏ వందో రెండు వందలో ఉంటుంది.మహా అయితే బహుశా 500 రూపాయల శాండ్ విచ్ గురించి కూడా మనం విని ఉండవచ్చు.

 If You Know The Price Of That Sandwich, You Should Be Shocked, Sandwich, High C-TeluguStop.com

కానీ ఏకంగా 16 వేల రూపాయల ధర కల శాండ్ విచ్ గురించి ఎవరూ వినుండరు. అంతలా ధర ఉన్న ఆ శాండ్ విచ్ గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించింది.

ఇంతకీ అంతలా రేటున్న ఆ శాండ్ విచ్ ను ఎక్కడ తయారు చేస్తారంటే.

న్యూయార్క్ నగరంలోని స్రెండిప్టీ3 అనే రెస్టారెంట్ లో ఇలా 16 వేల రూపాయల విలువగల శాండ్ విచ్ దొరుకుతుంది.

అసలు మన దేశంలో శాండ్ విచ్ ల గురించి గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న చాలా మందికి తెలియదు.కానీ న్యూయార్క్ లో ఏకంగా శాండ్ విచ్ ఖరీదే 16 వేల రూపాయలంటే ఇది విన్న ప్రతి ఒక్కరూ షాక్ కు గురికాక మానరు.

Telugu Teen Thosand, Ches, Ginnis, Cost, Yark, Sandwich, Gold-Latest News - Telu

ఈ రెస్టారెంట్ లో తయారు చేసే ఈ రుచికరమైన శాండ్ విచ్ ను తినేందుకు చాలా దేశాల వాళ్లు వస్తారు.ఇంతలా ఈ శాండ్ విచ్ లో 16 వేల రూపాయలు పెట్టేంత స్పెషాలిటీ ఏముందనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.ఈ శాండ్ విచ్ ను తయారు చేసేందుకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీస్ ను వాడతారు.పైగా దీనిపై గోల్డ్ కోటింగ్ కూడా వేస్తారు.అందువల్లే ఈ శాండ్ విచ్ కు దిమ్మతిరిగి పోయే ధరను నిర్ణయించారు రెస్టారెంట్ నిర్వాహకులు.ఇలా అత్యధిక ధర ఉండడంతో ఈ శాండ్ విచ్ ను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వరల్డ్ రికార్స్ట్ లో చేర్చి నూతన వరల్డ్ రికార్డును కట్టబెట్టారు.

ఎంతైనా ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న‌కు ఎంతో థ్రిల్ ఇస్తాయి క‌దా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube