IRCTC కొత్త రూల్స్ తెలిస్తే బిత్తరపోతారు... ట్రైన్‌లో గురకలు పెట్టడం నిషిద్ధం!

మనదేశ జనాభా 99 శాతం ట్రైన్‌ జర్నీనే ఇష్టపడుతుంది.ఎందుకంటే ఇక్కడ చిన్నవాళ్ళనుండి పెద్దవాళ్లవరకు ట్రైన్‌ జర్నీని చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు.

 If You Know The New Rules Of Irctc You Will Be Shocked Snoring Is Prohibited In-TeluguStop.com

పైగా టిక్కెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయి.మరీ ముఖ్యంగా నైట్ ప్రయాణం అనేది చాలా కూల్ గా సాగిపోతుంది.

అయితే నైట్‌ ప్రయాణాలు చేయడం మనలో అనేకమందికి ఒక్కోసారి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.ఎందుకంటే మిగతా బెర్తులనుండి వచ్చే గురకల సౌండ్‌, ఫోన్లో గుసగుసలు, పెద్దగా పాటలు వినబడటం అనే అంశాలు ఒకింత డిస్టర్బ్ చేస్తాయి.

ఇవన్నీ ట్రైన్‌ జర్నీలో ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయి.

ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని మార్పులు చేస్తోంది.

అవును, రాత్రిపూట ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా నిబంధనలను మార్చబోతోంది.రాత్రిపూట కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల నిద్రిస్తున్నప్పుడు కోచ్‌లో ఇతరులతో బిగ్గరగా మాట్లాడటం, బిగ్గరగా సంగీతం వినడం లేదా కాల్‌లో మాట్లాడటం, పెద్దగా గురకపెట్టడం చేస్తుంటారు.

ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల శబ్దం చేయకూడదని రైల్వే ప్రజలకు కఠినమైన సూచనలు చేసింది.దీనికి సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

ఈ నిబంధనలు త్వరలో అమలులోకి రానున్నాయి.

Telugu Irctc, Latest, Passengers, Shcok, Sleep, Train-Latest News - Telugu

ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానా పడుతుంది.అవును, ఇకనుండి రాత్రి సమయాల్లో సంగీతం వినడానికి, బిగ్గరగా మాట్లాడటానికి, శబ్దం చేయడానికి లేదా కాల్‌లో బిగ్గరగా మాట్లాడటానికి అనుమతి ఉండదు.ప్రయాణికులు సులువుగా నిద్రపోయేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది.

ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ప్రయాణం ప్రశాంతంగా ఉండడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.ఎవరైనా ప్రయాణీకుడు మరో ప్రయాణికుడికి ఇబ్బందిని కలిగిస్తే చర్య తీసుకోవడంతోపాటు వారికి జరిమానా విధిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube