ఈ లగ్జరీ వాచ్ ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే..?

If You Know The Cost Of This Luxury Watch, You Have To Lose Your Mind What Is Special About It , Luxury Watch, Jacob And Co, Billionaire Watch Series, Switzerland, Intense Yellow Diamonds

ప్రపంచంలో ఉండే అత్యంత ఖరీదైన వాచ్ల జాబితాలో ఈ వాచ్ ఒకటి.అమెరికాకు చెందిన జ్యువెలరీ, రిస్ట్ వాచ్ కంపెనీ అయిన జాకబ్ అండ్ కో( Jacob and Co ) దీనిని ప్రత్యేకంగా బిలియనీర్ వాచ్ సిరీస్ లో తయారుచేసింది.

 If You Know The Cost Of This Luxury Watch, You Have To Lose Your Mind What Is Sp-TeluguStop.com

దీని ధర 20 మిలియన్ డాలర్లు.మన భారత కరెన్సీలో దాదాపుగా రూ.164 కోట్ల రూపాయలు.స్విట్జర్లాండ్ లోని జెనీవాలో వాచెస్ అండ్ వండర్స్ యాన్యువల్ ఎగ్జిబిషన్లో ఈ వాచ్ ప్రదర్శింపబడింది.

ఈ ఖరీదైన వాచ్ లో 57 ఎమరాల్డ్ కట్ ఎల్లో డైమండ్స్, 76 అరుదైన రత్నాలు, 425 అసర్కట్ ఫ్యాన్సీ ఎల్లో, ఇంటెన్స్ ఎల్లో డైమండ్స్ తో ఉంది.జాకబ్ అండ్ కో కంపెనీ ఈ ఖరీదైన వాచ్ ని తయారు చేయడం కోసం దాదాపుగా మూడున్నర సంవత్సరాల సమయం పట్టింది.

ఈ వాచ్ లో హై క్వాలిటీ ఎల్లో డైమండ్స్, రత్నాలు గోల్డ్ బ్రాస్లైట్ లో అమర్చబడ్డాయి.ఈ వాచ్ లో 216.89 క్యారట్స్ డైమండ్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.ఈ వాచ్ తయారు చేయడం వెనుక పదిమంది నిపుణుల, 15 మంది కళాకారుల కష్టం ఉందని కంపెనీ తెలిపింది.880 క్యారెట్ల ఎల్లో డైమండ్స్ ని కట్ చేసి 216.89 క్యారెట్స్ గా చేశారు.జాకబ్ అండ్ కో కంపెనీ 2015లో మొదటి బిలియనీర్ వాచ్ ను 260 క్యారెట్ల వైట్ డైమండ్స్ తో తయారుచేసింది.తర్వాత 2018లో ఆరు మిలియన్ డాలర్ల విలువైన 127 క్యారెట్ల ఎల్లో డైమండ్స్ తో బిలియనీర్ వాచ్ ను తయారుచేసింది.

జాకబ్ అండ్ కో కంపెనీ 2015 నుండి ఇప్పటివరకు 21 బిలియనీర్ వాచ్ లను తయారుచేసింది.ఇందులో 20 వాచ్ లను 18 మిలియన్ డాలర్లకు అమ్మింది.

Video : If You Know The Cost Of This Luxury Watch, You Have To Lose Your Mind What Is Special About It , Luxury Watch, Jacob And Co, Billionaire Watch Series, Switzerland, Intense Yellow Diamonds #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube