ఉసిరి చేసే మేలు తెలిస్తే.. వదిలిపెట్టరు..!

ఉసిరి కాయలో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.అంతేకాదు ఉసిరి కాయను ఆమ్లా అని కూడా పిలుస్తుంటారు.

 If You Know The Benefit Of Breathing Do Not Give Up-TeluguStop.com

ఇక ఉసిరికాయ వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి.ఇది రుచిలోనూ, ఆరోగ్యాన్ని ప్రసాదించడంలోనూ ఉసిరి మొదటి స్థానంలో ఉంటుంది.

అంతేకాకుండా అందాన్ని మెరుగుపరచుకోవడంలోనూ మంచిగా పనిచేస్తుంది.అయితే ఉసిరిని ఆయుర్వేద ఔషదాలతో ఎక్కువగా వాడుతుంటారు.

 If You Know The Benefit Of Breathing Do Not Give Up-ఉసిరి చేసే మేలు తెలిస్తే.. వదిలిపెట్టరు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఉసిరి కాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్న మనం దానిని దూరంగానే ఉంచుతాము.మనం ఉసిరిని ఎక్కువగా ఊరగాయగా మాత్రమే పనికొస్తుందని అందరు అనుకుంటుంటారు.

ఇక ఉసిరి ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే రోజుకు ఒక‌టైనా తిన‌డానికి మొగ్గు చూపుతారని నిపుణులు అంటున్నారు.అసలు ఉసిరిలో ఉండే ప్ర‌యోజ‌నాలుఏంటో ఒక‌సారి తెలుసుకుందమా.

ఉసిరిలో విట‌మిన్ సీ ఎక్కువ‌గా దొరుకుతుంది.అంతేకాదు దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన ఇన్‌ఫెక్ష‌న్స్ బారిన ప‌డ‌కుండా చూస్తుంది.ఇక ఉసిరి శ‌రీర రెసిస్టెన్స్ ప‌వ‌ర్‌ను పెంచుతుందని అన్నారు.ఇక ఉసిరిలో ఆక‌లి పెంచే గుణాలు అధికంగా ఉంటాయని తెలిపారు.

ఉసిరికాయ తినడం వలన జ్ఞాప‌క‌శ‌క్తిని కూడా పెంచుకోవచ్చు.ఇక ఉసిరి ఐర‌న్ కంటెంట్‌ను పెంచ‌డానికి సహాయపడుతుంది.

దీంతో ఎనీమియా వంటి రోగాలను నివారించడంలో దోహదపడుతుంది.క్యాన్స‌ర్‌కు కార‌ణమ‌య్యే కార‌కాల‌ను ఉసిరి అడ్డుకుంటుంది.

ఎక్కువగా ఉసిరికాయ‌లు తిన‌డం వ‌ల్లన లంగ్స్‌, గుండె, లివ‌ర్‌ల‌ను వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.ఉసిరి తిన‌డం వ‌ల్ల ముఖం మీద వ‌చ్చే మొటిమ‌లు కూడా తగ్గుముఖం పడతాయి.

ఉసిరి కాయ రసంతో కూడా మేలు జరుగుతుందని తెలిపారు.ఉసిరి రసాన్ని చర్మానికి రాయడంతో మిల‌మిలా మెరిసిపోతుందన్నారు.

ఒత్తిడిని తగ్గించడంలోనూ, జుట్టును ధృడంగా ఉంచడంలోనూ ఉసిరి చాల ఉపయోగపడుతుంది.

#Health #Benfitis #Usiri

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు