విజయ్ సేతుపతి ఇంత పెద్ద సూపర్ స్టార్ ఎలా అయ్యాడో తెలిస్తే?

హీరో విజయ్ సేతుపతి అంటే బహుశా తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.చాలా క్రింది స్థాయి నుండి ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి తన అసామాన్యమైన నటనతో ప్రేక్షకులను తన నటనలో లీనం చేస్తున్న గొప్ప నటుడు విజయ్ సేతుపతి.

 If You Know How Vijay Sethupathi Became Such A Big Superstar Vijay Sethupathi, A-TeluguStop.com

ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు.అయితే తాజాగా టాలీవుడ్ లో మెగా వారసుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సాధించడంలో విజయ్ సేతుపతి సూపర్ పెర్ఫార్మెన్స్ ఒక కారణమని దర్శకుడు బుచ్చిబాబు, మూవీ యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే.అయితే సినిమా ఇండస్ట్రీ ఎంతో కష్టపడి ఇప్పుడు సూపర్ స్టార్ అయిన విజయ్ సేతుపతి అయిన విషయం తెలిసిందే.

అయితే విజయ్ ఈ సూపర్ స్టార్ స్థాయికి కావడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుందని ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు విలన్ సంపత్ సంచలన విషయాలను వెల్లడించాడు.విజయ్ సేతుపతి క్రింది స్థాయి నుండి ఈ స్థాయి వరకు వచ్చాడని, తను ఎప్పుడూ ఒక ఆశతో ఉండేవాడని, ప్రతి చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అందులో ప్రాణం పెట్టి నటించేవాడని అందుకే ఈ స్థాయికి వచ్చాడని విలన్ సంపత్ తెలిపారు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి ఉన్న స్థాయి చూస్తే అంతా నిజమే అని మనకు అనిపిస్తుంటుంది.ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న విజయ్ సేతుపతి ఇంకా భవిష్యత్తులో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube