ఈ భార‌తీయ కంపెనీలు నిముషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలిస్తే..

మ‌నం ఏదైనా జాబ్ చేస్తే నెల‌కు ఎంత సంపాదిస్తున్నారు అనే ప్ర‌శ్న‌లు మ‌న‌కు వినిపిస్తాయి.మ‌నం దాన్నే చాలా గొప్ప‌గా చెప్పుకుంటాం.మ‌రి ఉద్యోగుల‌మైన మ‌నం నెల సంపాద‌న గురించి మాట్లాడుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు అదికూడా ఇండియాలోనే టాప్ 10 కంపెనీలు అస‌లు నిముషానికి ఎంత సంపాదిస్తాయో తెలిస్తే షాక్ అయిపోవ‌డం ఖాయం.2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కంపెనీల సంపాద‌న‌ను ఇప్పుడు బ‌య‌ట పెట్ట‌గా ఇందులో కూడా అందరూ ఊహించిన విధంగానే అంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ప్లేస్ లో నిలిచింది.

 If You Know How Much These Indian Companies Are Earning Per Minute, Indian Compa-TeluguStop.com

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ర‌కాల బిజినెస్‌లు చేస్తున్న‌టువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతి నిముషానికి కూడా దాదాపుగా రూ.9.34 లక్షలు సంపాదిస్తున్న‌ట్టు నివేదిక తెల‌ప‌డంతో అంతా షాక్ అయిపోతున్నారు.ఏంటి ఒక్క నిముషానికే అంత సంపాదిస్తోందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.ఇక దీని త‌ర్వాత ప్లేస్ లో టీసీఎస్ నిముషానికి రూ.6.17 లక్షలు ఆర్జిస్తోంద‌ని తెలుస్తోంది.మూడో ప్లేస్ లో ఉన్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు కూడా నిముషానికి రూ.6.05 లక్షలు వెన‌కేస్తోంద‌ని నివేదిక వివ‌రించింది.ఇక నాలుగో స్థానంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు నిముషానికి రూ.4.26 లక్షలు ఎర్క‌న్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu Hdfc Company, Icici Bank, Indian, Indian Oil, Indian Top, Infosys, Relian

ఐదో స్థానంలో ఉంటున్న ఇండియన్ ఆయిల్ కంపెనీ కూడా బాగానే సంపాదిస్తోంది.ఈ కంపెనీ నిముషానికి ఏకంగా రూ.4.11 లక్షలు సంపాదిస్తుందని స‌మాచారం.ఇక ఐటీ కంపెనీగా అయిన దిగ్గ‌జ ఇన్ఫోసిస్ కంపెనీ కూడా నిముషానికి రూ.3.68 లక్షలు ఆర్జిస్తోందంట‌.వీటి త‌ర్వాతి స్థానంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు కూడా నిముషానికి 3.49 లక్షలు ఆర్జిస్తోంద‌ని తెలుస్తోంది.ఇక ఎనిమిదో ప్లేస్ లో ఉన్న‌టువంటి ఓఎన్ జీ సి 3.09 లక్షలు, తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ పెట్రోలియం ఊ.3.07 లక్షలు సంపాదిస్తున్న‌ట్టు నివేదిక తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube