ఈ క్రెడిట్ కార్డులు తీసుకుంటే ఎన్ని లాభాలు చేకూరుతాయో తెలిస్తే..

క్రెడిట్ కార్డులు మంచి అవసరంలో అండగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.కానీ వీటిని జాగ్రత్తగా వాడాల్సిన అవసరముందని అంటుంటారు నిపుణులు.

 If You Know How Much Profit You Can Make By Taking These Credit Cards, Credit Ca-TeluguStop.com

ముఖ్యంగా అనేక బ్యాంకింగ్ సంస్థలు ఆఫర్ చేస్తున్న క్రెడిట్ కార్డులలో ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.లేదంటే అధిక మొత్తంలో నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.

అయితే తాజాగా ఆర్థిక నిపుణులు 3 క్రెడిట్ కార్డులతో లెక్కలేనన్ని లాభాలు చేకూరుతాయని తెలియజేశారు.అవేవో ఇప్పుడు చూద్దాం.

1.యాక్సిస్ బ్యాంకు ఏస్ క్రెడిట్ కార్డు

ఈ క్రెడిట్ కార్డు గూగుల్ పే ద్వారా చెల్లించే అన్ని యూటీలిటీ లావాదేవీలపై 5% క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది.

అంతేకాదు స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా వంటి వివిధ ఆన్ లైన్ ఆర్డర్లపై 4% క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ చేస్తుంది.అలాగే మిగిలిన అన్ని రకాల పేమెంట్స్ పై 2% క్యాష్‌బ్యాక్‌ అందజేస్తోంది.

ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు 400కు పైగా రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఈ రెస్టారెంట్లలో భోజనం చేసి 20 శాతం రాయితీ పొందొచ్చు.దీని వార్షిక ఫీజును రూ.499గా యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించింది.

2.హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా క్రెడిట్ కార్డు

హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఇన్సూరెన్స్, యుటిలిటీస్, విద్య, అద్దె వంటి అన్ని రిటైల్ పేమెంట్లపై ప్రతి రూ.150కి 4 రివార్డు పాయింట్లు సొంతం చేసుకోవచ్చు.విమానం టిక్కెట్లు, హోటల్ బుకింగ్, గిఫ్ట్‌లు, ప్రొడక్టులు కొనుక్కునే సమయంలో ఈ రివార్డు పాయింట్లను యూజ్ చేసి కొంత ఆర్థిక లాభం పొందవచ్చు.

కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్టు లాంజ్ యాక్సెస్‌ను కూడా ఈ క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తోంది.దీని సాయంతో కార్డుదారులు 12 సార్లు భారతదేశంలో, 6 సార్లు ఇతర దేశాల్లో ఎయిర్ పోర్టుల లాంజ్ ను యాక్సెస్‌ చేయవచ్చు .

3.ఎస్‌బీఐ కార్డు ఎలైట్

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న ఎస్‌బీఐ కార్డు ఎలైట్ ద్వారా యాత్రా, బాటా, పాంటాలూన్స్, షాపర్స్ స్టాప్ వంటి షాపుల్లో చెల్లింపులు చేసి రూ.5 వేల విలువైన ఈ-గిఫ్ట్ ఓచర్‌ను గెలుచుకోవచ్చు.ఈ క్రెడిట్ కార్డుతో కాంప్లిమెంటరీ ట్రైడెంట్ ప్రివిలైజ్ మెంబర్‌షిప్, క్లబ్ విస్తారా మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు.

అలాగే ఈ క్రెడిట్ కార్డు సాయంతో విదేశాల్లోని 6 ఎయిర్‌పోర్టులలో… భారతదేశంలోని 2 ఎయిర్‌పోర్టులలో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సస్‌ను పొందవచ్చు.డైనింగ్, గ్రోసరీ, డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో చెల్లింపులు చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ సంపాదించి వాటిని ఇతర ఖర్చులకోసం వినియోగించవచ్చు.

Best Credit Cards for Big Discounts, Cashbacks

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube