ఇంట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడో తెలిస్తే?

క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు క్రికెట్ లో భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలుపుతూ చిరస్మరణీయ విజయాలను అందిస్తున్న విషయం తెలిసిందే.అయితే మైదానంలో విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా ఉంటాడు.

 If You Know How Captain Virat Kohli Is At Hom-TeluguStop.com

అసలు ఓటమిని ఒప్పుకోని తత్వంతో ప్రత్యర్థి ఆటగాళ్లతో వారి నుండి ఏమైనా రియాక్షన్ వస్తే తిరిగి దానిని బ్యాట్ తో సమాధానమిచ్చి వాళ్ళకు దిమ్మతిరిగే సమాధానమిస్తాడు.అవును ఇలా ఎంతో దూకుడుగా ఇంట్లో ఎలా ఉంటాడో తెలిస్తే ఇతనేనా ఆ విరాట్ కోహ్లీ అని ఆశ్చర్యపోక మానరు.

అయితే తాజాగా మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి.మాజీ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఇంట్లో చూస్తే మీకు ఎక్కడా పని వాళ్ళు కనబడరు.

 If You Know How Captain Virat Kohli Is At Hom-ఇంట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమ ఇంటికి వచ్చిన అతిథులకు వారే వడ్డిస్తారని, అంతకంటే గొప్ప ఆతిథ్యం ఏముంటుందని, మన పక్కనే ఉండి కబుర్లు చెబుతూ వచ్చిన అతిథులతో సూపర్ స్టార్ అని కాకుండా చాలా సాధారణంగా ఉంటాడు.ఇటువంటి లక్షణాలు చాలా అరుదు.

మైదానంలో ఆటకు సంబంధించిన ప్లాన్ ఏదైనా వర్కౌట్ కాకపోతే ఒత్తిడి ఉంటుంది కాబట్టి దూకుడుగా ఉండేలా పరిస్థితులు అక్కడ ఉంటాయని వారన్నారు.ఏది ఏమైనా విరాట్ కోహ్లీ భారత దేశానికి మరో వరల్డ్ కప్ మనకు అందిస్తాడని యూవత్ భారతావని కోరుకుంటందనడంలో ఎటువంటి సందేహం లేదు.

#IndianCricketer #Indian Cricket #@imVkohli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు