గర్ల్ ఫ్రెండ్ ను చంపడానికి ఇతను చెప్పిన రీసన్ వింటే..!

అసలు ప్రేమ తోనే ఈ ప్రపంచం మొత్తం నడుస్తోందని కొంత మంది చెబుతూ ఉంటారు.కానీ అది వాస్తవం కాదని ఇప్పటికే చాలా ఘటనలు ప్రూవ్ చేశాయి.

 If You Hear The Reason He Said To Kill His Girlfriend-TeluguStop.com

జీవితాల్లో కొందరికి ప్రేమ కోలుకోలేని చీకట్లను నింపుతుంది.అలాంటి వాళ్లు అసలు ప్రపంచంలో ప్రేమే లేదని అంటూ ఉంటారు.

కానీ కొందరి జీవితాల్లో మాత్రం ప్రేమ సంతోషాలను నింపుతుంది.వారు ప్రేమ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు.

 If You Hear The Reason He Said To Kill His Girlfriend-గర్ల్ ఫ్రెండ్ ను చంపడానికి ఇతను చెప్పిన రీసన్ వింటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇవ్వన్నీ సంగతులు ఇప్పుడెందుకని చాలా మంది ఆలోచిస్తుంటారు.తాజాగా దుబాయ్ లో జరిగిన ఘటన చూస్తే ఎవరైనా సరే ప్రేమికులతో పాటు మామూలు మనుషులు కూడా షాక్ తింటారు.

దుబాయ్‌లో ఓ వ్యక్తి తన ప్రియురాలిని అతి కిరాతకంగా బాత్‌టబ్‌లో ముంచి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.చంపేసిన సదరు ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.

ఆయన చెప్పిన సమాధానం విని పోలీసులు ఒక్క సారిగా కంగుతిన్నారు.తన ప్రేయసికి ఆరోగ్యం బాగా లేదని తన స్నేహితులతో చెబుతూ వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తన ప్రియురాలిని చంపేసాడు.

ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ ఆ యువతి హత్యకు గురైన రోజు నిందితుడు ఫుల్లుగా మందు తాగి ఉన్నాడని తెలిపారు.అంతే కాకుండా మరో షాకింగ్ విషయాన్ని కూడా వారు వివరించారు.

తన ప్రేయసిని చంపే ముందు ఆ వ్యక్తి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి తన ప్రియురాలిని దెయ్యం పట్టిందని తెలపడం గమనార్హం.హత్య చేసే ముందు ఆమెను కిరాతకంగా కొట్టినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేటతెల్లమైందని వారు వెల్లడించారు.

కాగా.ప్రియురాలిని పొట్టన పెట్టుకున్న ఆ నిందితుడికి అనేక మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

అంతే కాకుండా అతడి స్నేహితులు, పక్కింట్లో ఉండే వాళ్ల స్టేట్మెంట్లు కూడా రికార్డు చేసినట్లు పేర్కొన్నారు.

#Bathtub #Hear Girlfriend #Dubai #Girlfriend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు