సొంత సెలూన్ షాప్ ఉంటే చాలు పిల్లనిస్తారట...

ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకోవాలనుకున్న యువత ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికలు కలిగి ఉన్నారు.ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మ్యాట్రిమోనీ లకు వెళ్లి మాకు ఇలాంటి అర్హతలు ఉన్న వరుడు కావాలని నిర్మూమాటంగా చెప్పేస్తున్నారు.

 If You Have Your Own Salon Shop, You Will Have Enough To Marrege , Marrege, Vira-TeluguStop.com

ఇటీవల ఇలాంటి ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ప్రకటన ఏమిటంటే వరుడు కావాలంటూ, అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగి మాత్రం అస్సలు కాల్ చేయవద్దు అని ఆ ప్రకటనలో ఉంది.

ప్రైవేట్‌ జాబ్‌ చేసేవాళ్ల కన్నా కూడా చిన్న బిజినెస్‌ ఉన్న వాళ్లకే పిల్లని ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు.ఈ మధ్య కాలంలో యువత సరికొత్త ఆలోచనలతో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తుంటే మరికొందరు కులవృత్తిని కొనసాగిస్తూ బిజినెస్‌ చేస్తూ ఉన్నారు.

అలాంటి యువత లో ఒకరే సెలూన్ షాప్ రాంబాబు.అయితే ఈ షాపు పెట్టడం వెనక రాంబాబు చెప్పే కారణం వింటే ఆశ్చర్యపోవాల్సిందే.

యువత ఎక్కువగా బార్బర్ షాప్ ను పూర్వం తాతలు, తండ్రి నుండి వస్తున్న ఆచారాన్ని ప్రస్తుత యువత కూడా పాటిస్తూ బార్బర్ షాప్ ను నడుపుతూ ఉండడానికి ఒక కారణం ఉందని రాంబాబు చెబుతున్నాడు.తమ కులంలో అబ్బాయిలకు పెళ్లి కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా కూడా సొంత సెలూన్ షాప్ ఉండాలి.

అలాంటి వారికే త్వరగా పెళ్లిళ్లు జరుగుతాయట.ఆర్థిక పరిస్థితులు బాగోలేక సొంత షాప్ పెట్టుకొలేని యువకులు మరొకరి షాపులో పనిచేసుకుంటూ సొంత షాపు పెట్టుకునే డబ్బులు సంపాదించుకుంటున్నారు.

Telugu Job, Latest, Marrege, Matrimony, Salon Shop-Latest News - Telugu

ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువుకోలేని యువత కూడా బార్బర్ షాపులో పనిచేసి లక్షల్లో సంపాదిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగంలో సంపాదించే కన్నా ఈ షాపులోనే ఎక్కువ సంపాదిస్తున్నారు.బార్బర్ షాప్‌లు నిర్వహిస్తున్న యువకులు పెళ్లి చేసుకునేందుకు సంబంధాలకు వెళితే మంచి ఆదరణ లభిస్తుందని రాంబాబు చెబుతున్నారు.తమ కుల వృత్తిలో సొంత షాప్ పెట్టుకుంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువ గౌరవిస్తున్నారని యువకులు తెలిపారు.

నెల జీతం కోసం ఎదురుచూసే పని ఉండదు.ఎప్పుడూ చేతిలో డబ్బులు ఉంటాయని,తమ ఆడపిల్లను ఇస్తే సుఖపడుతుందనే భావనలో తల్లిదండ్రులు ఉంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube