ఈ 7 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

రకరకాల యాప్స్ పేరుతో స్మార్ట్ ఫోన్ యూజర్లను ఎప్పటికప్పుడు భయపెడుతూనే వస్తున్నారు సైబర్ నేరగాళ్లు.రకరకాల ఫేక్ యాప్స్ లతో అమాయకులను మోసం చేస్తున్న సంఘటనల గురించి మనం చాలానే విని ఉంటాము.

 If You Have These 7 Apps On Your Phone, Delete Them Immediately Android Apps, De-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా మరొక డెంజరస్ యాప్స్ కొన్ని బయట పడ్డాయి.అవి కనుక మీ ఫోన్ లో ఉంటే క్షణాల్లో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వడం గ్యారంటీ.

ఒకవేళ మీరు కనుక మేము చెప్పిన ఈ 7 యాప్స్‌ లో ఏ ఒకటి అయిన మీ ఫోన్లో ఉంటే వెంటనే వాటిని అన్‌ ఇన్‌స్టాల్ చేసేయండి.

ఈ ఏడు యాప్స్ లో ప్రమాదకరమైన జోకర్ మాల్‌వేర్ ను గుర్తించడం జరిగింది.

జోకర్ మాల్వేర్ ఎంత ప్రమాదకరమైనదంటే మీ ప్రమేయం లేకుండానే మీ పేమెంట్ సర్వీసెస్‌కు మీ అకౌంట్‌ని సబ్‌స్క్రైబ్ చేసిమీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తాన్ని ఖాళీ చేసేస్తోంది.మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అయ్యేంతవరకు కూడా మీకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంది ఈ జోకర్ మాల్వేర్ ఈ ప్రమాదకరమైన యాప్స్‌లో మాల్‌వేర్ ఉన్నట్టు క్యాస్పర్‌స్కీ గుర్తించింది.

ఈ యాప్స్ పై యూజర్లను అప్రమత్తం చేసేందుకు క్యాస్పర్‌స్కీ ట్విట్టర్‌లో పలు పోస్టులు కూడా చేసింది.

Telugu Android Apps, Delete, Google, Key Board, Store, Smart Phone-Latest News -

దీంతో అప్రమత్తమైన గూగుల్ ఆ 7 యాప్స్ వెంటనే డిలిట్ చేయాలని హెచ్చరిస్తోంది.ఇకపై మీరు యాప్స్ డౌన్‌లోడ్ చేసేప్పుడు గూగుల్ ప్లేస్టోర్ నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోమని హెచ్చరిస్తుంది.మరి లేటెస్ట్‌ గా జోకర్ మాల్‌వేర్ గుర్తించిన ఆ ఏడు యాప్స్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

1) QRcode Scan 2) Emoji One key board 3) Animations Battery Wallpaper 4)Battery ChargingDazzling keyboard 5)Volume Booster Loud Sound Equaliser 6)Classic Emoji Keyboard 7)Super Hero effect

పైన తెలిపిన ఈ 7 యాప్స్ లో ఏవైనా మీ ఫోన్లో ఉంటే వెంటనే అన్ ఇన్స్టాల్ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube