వైసీపీలో ఆది నుంచి ఉన్నవారికే పదువులు దక్కడం లేదు.ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రం లేదు.
అయితే మధ్యలో వచ్చిన కొందరు టీడీపీ జంపింగులకు కొన్ని పదవులు దక్కాయి.వీరిలో తూ ర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వంటి వారికి పదవులు ఇచ్చారు.
దీంతో అప్పట్లోనే టీడీపీ నుంచి చాలా మంది పార్టీ మారేందుకు రెడీ అయ్యారు.అయితే కొందరికి మాత్రమే.
వైసీపీలోకి ఆహ్వానం పలికారు.అయితే.
మిగిలిన వారిలో చాలా మంది మౌనంగా ఉండిపోయారు.
అయితే.
గతంలోనే వచ్చిన వారిలో కొందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.
దీంతో ఇలాంటి వారు ఒకింత వగరుస్తున్నారు.దీనిపై తరచుగా పార్టీ నేతలను కలిసి.
తమకు ఏదైనా ప్రాధాన్యం ఉన్న పదవులు ఇవ్వాలని తమ వాయిస్ వినిపిస్తున్నారు.కానీ, ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
పైగా పదవులు ఇచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.దీంతో ఇటీవల కొందరు నాయకులు ప్రభుత్వ సలహాదారుల్లో కీలకమైన సలహదారు వద్దకు వచ్చి మొర పెట్టుకున్నారు.

సార్ పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు.కానీ, మాకే ఇక్కడ గుర్తింపు లేదు సో వచ్చేవారిలో చాలా అనుమానాలు ఉన్నాయి.మీరు ఏదైనా పదవి ఇప్పించాలంటూ ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు కోరారు.అయితే సదరు సలహాదారుచిత్రమైన వ్యాఖ్య చేశారని అంటున్నా రు.టీడీపీలో ఉన్నప్పుడు మీరేం చేశారు ? అక్కడెలాంటి పదవులు వచ్చాయి ? అని ప్రశ్నించి అక్కడ గుర్తింపు ఉంటేనే ఇక్కడకూడా పదవులు దక్కుతాయి.
అంతేకానీ పందేరం చేయడానికి ఇదేమీ బాబు ప్రభుత్వం కాదు అని చెప్పేసరికి సదరు నాయకులు నలుగురు కూడా నొచ్చుకున్నారు.
ఇప్పటికే పార్టీ మారిపోవడం వ్యాపారాలు వ్యవహారాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో నాయకులు చోటా పదవుల కోసం ఎదురు చూస్తుండడం గమనార్హం కానీ సర్కారు వారి మాట మాత్రం ఇలా ఉందని వారు చర్చించుకుంటున్నారు మరి ఎప్పటికి వీరి కలలు నెరవేరుతాయో చూడాలి.
.