ఇలాంటి క్రేజీ ఫ్రెండ్స్ ఉంటే ఆ కిక్కే వేరే.. ఏం చేశాడంటే..?

మనమందరం రోజూ సోషల్ మీడియాలో వేలాది రకాల వీడియోలను చూస్తూ ఉంటాం.వాటిల్లో కొన్ని వీడియోలు నవ్వు తెప్పించేల ఫన్నీగా ఉంటాయి.

 If You Have Crazy Friends Like That That Kick Is Different What Did You Do, Craz-TeluguStop.com

అలాంటి వీడియోలను చూసిన మనం లైక్ చేయకుండా ఉండలేం.అలా నవ్వు తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ప్రతి బ్యాచులో ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడని అంటున్నారు.

అంతలా నెటిజన్లను తమ వైపుకు తిప్పకుంది ఈ వీడియో.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే….

ముగ్గురు స్నేహితులుండగా… అందులో ఒక వ్యక్తి గ్లాసులో నిండా కూల్ డ్రింక్ పోస్తాడు.గ్లాసులో పోసిన కూల్ డ్రింక్ ను తాగేందుకు అక్కడ ఉన్న తన ఇద్దరు స్నేహితులను ఆహ్వానిస్తాడు.

అంత వరకు సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా గడిపిన ఆ ఇద్దరు తమ ఫ్రెండ్ డ్రింక్ తాగేందుకు పిలవగానే వస్తారు.ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా… తర్వాత జరిగింది చూసి ఆ వ్యక్తి స్నేహితులు తెల్ల ముఖం వేశారు.

ఎంత సేపు తాగిన వారికి గ్లాసులో ఉన్న కూల్ డ్రింక్ నోట్లోకి రాకపోవడంతో షాక్ తిన్నారు.అసలు ఏమై ఉంటుందా…

అని చూడగా… తమను డ్రింక్ తాగేందుకు పిలిచిన స్నేహితుడు తమకు ఒకే స్ట్రాకు ఉన్న రెండు మొనలను ఇచ్చాడని వారికి అర్థం అవుతుంది.ఇది చూసిన ప్రతి ఒక్కరూ తమ బాల్యం నెమరువేసుకుంటున్నారు.తమ బ్యాచులో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండేవాడని గుర్తు చేసుకుంటున్నారు.

ఈ వీడియోను కావాలనే చేసినా… ఇందులో ఉన్న ఫన్ మాత్రం నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది.

ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube