బాయ్ ఫ్రెండ్స్ ఉంటే సౌత్ ఇండియాలో సినీ అవకాశాలు రావడం కష్టమే.. ఇలియానా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్స్ వ్యక్తిగతంగా ఏ విషయం మాట్లాడిన కూడా అది వైరల్ గా మారుతుంది.ముఖ్యంగా తమ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం కొన్ని రోజుల వరకు అదే చర్చ గా మారుతుంది.

 If You Have Boyfriends It Is Difficult To Get Movie Opportunities In South India-TeluguStop.com

ఇదిలా ఉంటే గతంలో ఇలియానా కూడా సినీ అవకాశాలకు బాయ్ ఫ్రెండ్ కు లింక్ పెట్టింది.బాయ్ ఫ్రెండ్స్ ఉంటే సౌత్ ఇండియాలో సినిమా అవకాశాలు రావడం కష్టమని ఓపెన్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన గ్లామర్ తో ఎంతో మంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.తన నటనతో కూడా మంచి పేరు సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.

ఇక ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది.

దేవదాసు సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీ పరిచయమైంది ఇలియానా.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఏడాదికి వరుస సినిమాలతో తన ఖాతాను నింపుకుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫిజిక్ ఉన్నా హీరోయిన్ గా నిలిచింది.

గతంలో మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల తో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది.

అదే సమయంలో ఈ అమ్మడు లావై అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అకస్మాత్తుగా శరీర బరువును పెంచడంతో అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.ఇక తను మళ్లీ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం బాగా కష్టపడింది.

జిమ్ లో ఎక్కువ సమయం కేటాయించి మరి తెగ వర్కౌట్లు చేసింది.అంతేకాకుండా డైట్ ఫుడ్ కూడా తీసుకుంది.

దీంతో మళ్లీ మునుపటిలా తయారయింది.

Telugu Boy Friends, Ileana, Tollywood-Movie

ఇదిలా ఉంటే గతంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.బాయ్ ఫ్రెండ్ ఉంటే సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ లో అవకాశాలు రావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఇక దర్శకనిర్మాతల ఆలోచనలు కూడా ఎలా ఉంటాయో తేల్చి చెప్పేసింది.గతంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమవడంతో ఇటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఇలియానా.

ఇక మళ్లీ రీ ఎంట్రీ కోసం పోరాడుతుంది.మొత్తానికి ఒక సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య బాగా యాక్టివ్ గా మారింది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.

నిజానికి ఇలియానా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రెట్టింపు తో హాట్ షో చేస్తుంది.ఎద అందాలతో నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను తన అందంతో మరోసారి ఫిదా చేస్తుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube