విడాకుల కోసం కోర్టుకు వెళ్తే మ‌ళ్లీ పెండ్లి..

ఈ మ‌ధ్య పెండ్లి చేసుకున్న కొద్ది రోజుల‌కే విడాకులు తీసుకుంటున్నారు చాలామంది.భార్య‌భ‌ర్త‌ల అనుబంధాన్ని కూడా ప‌క్క‌న పెట్టి మ‌రీ చిన్న చిన్న కార‌ణాల‌తోనే విడాకులు తీసుకుంటున్నారు.

 If You Go To Court For Divorce Get Married Again-TeluguStop.com

ఆనందంగా క‌లిసి ఉండాల్సిన దంపతులు ఏవో చిన్న చిన్న గొడ‌వ‌లు పెట్టుకుని క్షణికావేశాలల‌కు లోన‌య్యి అన‌వ‌స‌రంగా పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు.వాస్త‌వానికి నాలుగు గోడల మధ్య స‌ర్ధుకుపోయే సమస్యల‌ను పెద్ద‌ది చేసి అన‌వ‌స‌రంగా రోడ్డుకు ఎక్కుతున్నారు.

త‌మ కోపాలు, పంతాలు ఇలా వారిని ఒంట‌రి చేస్తున్నాయి.

 If You Go To Court For Divorce Get Married Again-విడాకుల కోసం కోర్టుకు వెళ్తే మ‌ళ్లీ పెండ్లి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంత‌కూ రాజీ పడకుండా కోర్టుల చుట్టూ విడాకుల కోసం తిరుగుతూ ఉన్న కేసులు మ‌న దేశఃలో కోకొల్లలుగా ఉన్నాయి.

కాగా ఇలాంటి వారికోసం ఈ స్టోరీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుందేమో.ఎందుకంటే ఇలాగే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన జంటకు పెండ్లి గొప్ప‌త‌నం గురించి చెప్పి మళ్లీ వారిని ఒక్క‌టి చేశారు.

విన‌డానికే ఆశ్చ‌ర్యంగా ఉన్న ఈ ఘ‌ట‌న ఒడిశాలో చోటు చేసుకుంద‌ని తెలుస్తోంది.ఇక‌పోతే ఈ రాష్ట్రంలోని బొరిగుమ్మ సమితి పాత్రపుట్ గ్రామంలో నివ‌సిస్తున్న ఫల్గుణి హొతాకు అనితను పెండ్లి అయింది.

కాగా చిన్న గొడ‌వ‌లు రావ‌డంతో 2018లో విడాకుల కోసం ఇద్ద‌రూ కోర్టు మెట్లు ఎక్కారు.ఇక అప్ప‌టి నుంచి వీరు విడాకుల కోసం తిరుగుతూనే ఉన్నారు.అయితే వీరికి అప్ప‌టికే కుమార్తె ఉండటం విశేషం.అయితే వీరి కేసును వాదిస్తున్న లాయ‌ర్ మున్నా సింగ్ వీరిద్ద‌రికీ న‌చ్చ‌జెప్పి పెండ్లి గొప్ప‌త‌నాన్ని వివ‌రించి మ‌రీ జాతీయ లోక్ అదాలత్ లో వీరిని ఒక్క‌టి చేశారు.

వీరిద్ద‌రికీ మళ్లీ పెండ్లి చేసి క‌లిసి మెలిసి జీవించాలంటూ మాట తీసుకున్నారు.దీంతో అంద‌రూ కూడా ఆ లాయ‌ర్‌ను తెగ పొగిడేస్తున్నారు.ఇలాంటి లాయ‌ర్లు ఉంటే ఎవ‌రికీ విడాకులు రావంటూ చెబుతున్నారు.

#Marrege #Marrege #Odisha #Divorce #Anitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు