మీ ఫేస్ రైట్స్ ఇస్తే రూ.1.5కోట్లు ఇస్తుంద‌ట ఆ కంపెనీ.. ఎందుకంటే..?

టెక్నాల‌జీ పెరుతున్నా కొద్దీ అనేక ర‌కాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.దీంతో ఎన్న‌డూ లేనన్ని కొత్త ర‌కాల వ‌స్తువులు అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి.

 If You Give Your Face Rights The Company Will Give You Rs 1.5 Crore Because, Rob-TeluguStop.com

టెక్నాల‌జీ ప్ర‌పంచం మ‌రింత స్మార్ట్ గా త‌యార‌వుతుండ‌టంతో ప‌నులు కూడా అంతే స్మార్ట్ గా మారుతున్నాయి.ఇక ఇప్పుడు మ‌ర మ‌నిషి అదే నండి రోబోల విష‌యంలో కూడా ఇలాంటి టెక్నాల‌జీ మరింత వేగంగా పుంజుకుంటోంది.

మామూలుగానే రోబోలు అంటే అంద‌రికీ ఎక్క‌డా లేనంత ఇంట్రెస్ట్ పుడుతుంది.అయితే ఇప్పుడు ఓ రోబో గురించిన వార్త నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

దాని గురించి తెలిస్తే మీరు కూడా ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌వుతారంటే న‌మ్మండి.సాధార‌ణంగా రోబోలు అంటే బ‌య‌ట మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఏదో ఇనుములాగా క‌నిపిస్తాయి.కానీ ర‌జినీ కాంత్ సినిమా అయిన రోబో లాగా మనిషి రూపాన్ని పోలి ఉండ‌దు క‌దా.అయితే ఇప్పుడు ఓ కంపెనీ ఇలాంటి ప్ర‌యోగ‌మే చేయ‌బోతోంది.

అది కూడా ఎవ‌రైనా త‌మ ముఖాన్ని పోలిన‌ట్టు ఉండే రోబోని త‌యారు చేయాల‌ని కోరుకుంటే కొన్ని అర్హతలు ఉంటే వారిలాగే రోబోను త‌యారు చేసేందుకు ప్రోమోబాట్ అనే రోబోల కంపెనీ ముందుకు వ‌చ్చింది.

Telugu Crore Rupees, Face, Humanoid Robots, Robo, Robo Face, Sell Face-Latest Ne

మనుషుల్లాగే ఉండే రోబోల‌ను త‌యారు చేసేందుకు ఎవ‌రైనా త‌మ ముఖానికి ఉండే ఫేస్ రైట్స్‌ను ఇస్తే వారికి రూ.1.5 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసింది.ప్ర‌ప‌చంలో ఎవ‌రైనా ఇవ్వొచ్చ‌ని, ఇందుకు ఎలాంటి లింగ‌, మ‌త బేధాలు లేవ‌ని తెలిపింది.

కాగా 25 ఏళ్లు పైబడి ఉన్న ఎవ‌రైనా అర్హులే అంటూ ప్ర‌క‌టించింది.యుఎస్ఎ కు చెందిన ఈ కంపెనీ ఫేషియల్ రికగ్నిషన్, అలాగే స్పీచ్, అటానమస్ నావిగేషన్, హ్యూమనాయిడ్ రోబోస్ త‌యారీలో ఈ కంపెనీ ముందు వ‌రుస‌లో ఉంది.

ఇలా ఎవ‌రైనా ముందుకు వ‌స్తే వారి ముఖాన్ఇన 3డీ స్కాన్ చేసి, జీవితాంతం ఫేస్ రైట్స్‌ను కంపెనీ ఉప‌యోగించుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube