మీ ఫోనును సైలెంట్ మోడ్‌లో పెట్టి మ‌ర‌చిపోయారా.. మ‌రేం ప‌ర్లేదు ఇలా క‌నుక్కోండి!

ఒక్కోసారి మ‌నం మ‌న మొబైల్ ఫోనును సైలెంట్ మోడ్‌లో పెట్టి మ‌ర‌చిపోతుంటాం.అలాంట‌ప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

 If You Forget To Put Your Phone On Silent Android Smart Phone Laptop Computer Hi-TeluguStop.com

సైలెంట్ మోడ్‌లో ఫోనును పెట్టిన‌ప్పుడు దానిని క‌నుక్కోవడం చాలా క‌ష్టం.అయితే ఒక చిన్న‌ప‌ని ద్వారా మీ ఫోనును సుల‌భంగా క‌నుక్కోగ‌లుగుతారు.

అదేమిటో ఇప్పుడు చూద్దాం.సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ని కనుగొనడానికి మీరు మీ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజ‌ర్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఇంటర్నెట్ అనుసంధాన‌మైన ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ సౌకర్యవంతంగా ఉంటుంది.

దానిలో మీ జీమెయిల్‌కి లాగిన్ అవ్వండి.

త‌రువాత మీ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజ‌ర్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.దీనిలో అవ‌స‌ర‌మైన కొన్ని వివ‌రాలు ఇవ్వ‌డం ద్వారా మీ ఫోనును గుర్తిస్తారు.

అప్పుడు దానిలో మీరు ప్లే సౌండ్‌పై క్లిక్ చేయాలి.ఇలా క్లిక్ చేయగానే, మీ ఫోన్ ఫుల్ వాల్యూమ్‌తో మోగడం ప్రారంభమవుతుంది.

ఈ విధంగా మీరు మీ మొబైల్‌ను సులభంగా కనుగొనవచ్చు.ఫోను ఇంట్లో ఉంటే ప‌ర్వాలేదు.

అదే బ‌య‌ట‌గానీ పోతే ఇక్క‌డి నుంచే సందేశాన్ని పంప‌వ‌చ్చు.

దయచేసి నా మొబైల్‌ను తిరిగి ఇవ్వండి, మీకు తగిన బహుమతి ఇస్తామ‌ని మెసేజ్ పెట్టండి.దీనికి సంబంధించిన సౌండ్ రాగానే అవ‌త‌లి వ్య‌క్తికి కాల్ హానర్ అనే ఆప్షన్ క‌నిపిస్తుంది.అతను దానిపై క్లిక్ చేసిన వెంటనే, ఒక కాల్ మీ ద‌గ్గ‌రున్న మ‌రో నంబర్‌కు వ‌స్తుంది.

అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.ఈ విధంగా మీ ఫోను మీకు చేరుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube