ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. తొడ‌ కొవ్వు క‌ర‌గడం ఖాయం?

ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మంది తొడల‌ కొవ్వు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.శ‌రీరం ఎంత స‌న్న‌గా, నాజూగ్గా ఉన్నా తొడ‌ల భాగంలో మాత్రం లావుగా ఉంటుంది.

 If You Follow These Simple Tips Is It Possible To Lose Thigh Fat-TeluguStop.com

అధిక కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల తొడ‌లు లావుగా మార‌తాయి.దాంతో అంద‌వికారంగా క‌నిపిస్తారు.

ఇక తొడ‌ల కొవ్వును క‌రిగించుకునేందుకు ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే కొన్ని కొన్ని సింపుల టిప్స్ పాటిస్తే తొడ‌ల కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

 If You Follow These Simple Tips Is It Possible To Lose Thigh Fat-ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. తొడ‌ కొవ్వు క‌ర‌గడం ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌న్నింగ్ లేదా సైక్లింగ్ లేదా వాకింగ్ ఈ మూడూ తొడ‌ల కొవ్వును క‌రిగించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల‌, ప్ర‌తి రోజు ఒక గంట పాటు ఈ మూడిటిలో ఏదో ఒక‌టి చేయ‌డం లేదా మూడిటిని చేయ‌డం చేస్తే క్ర‌మంగా తొడ కొవ్వు క‌రుగుతుంది.అలాగే కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.కాబ్ట‌టి, తొడ కొవ్వును క‌రిగించునేందుకు ప్ర‌య‌త్నించే వారు రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకుంటే చాలా మంచిది.

తొడ కొవ్వు క‌రిగించుకోవాలంటే ఖ‌చ్చితంగా స్వీట్స్‌, కూల్ డ్రింక్స్, సోడాలు వంటి వాటికి దూరంగా ఉండాలి.మ‌ద్యం అల‌వాటును కూడా మానుకోవాలి.కేల‌రీలు త‌క్కువ‌గా, పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకోవాలి.వాట‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.కొవ్వును క‌రిగించి శ‌రారీన్ని హైడ్రేటెడ్‌గా ఉంచ‌డంలో నీరు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్లు, నీరు తాగితే తొడ‌ల కొవ్వే కాదు పొట్టు కొవ్వు మ‌రియు ఇతర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.

అలాగే మెట్లు ఎక్క‌డం వ‌ల్ల తొడ కొవ్వు త్వ‌ర‌గా త‌గ్గుతుంది.అందువ‌ల్ల‌, ప్ర‌తి రోజు ఒక ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు మెట్లు ఎక్క‌డం, దిగ‌డం చేస్తే తొడ కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

#Reduce Fat #Health #Good Health #Thighs #Health Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు