ఆ ఆలయంలో అడుగుపెడితే నరికేస్తా !     2018-10-12   20:40:08  IST  Sai M

ఆడవాళ్లను అడ్డంగా నరికివేయాలంటూ మళయాళం సినీ నటుడు కొల్లాం తులసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలసిందే. కాగా.. సుప్రీం ఇచ్చిన తీర్పును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరు మహిళలు కూడా సుప్రీం తీర్పును తప్పుబట్టారు. సుప్రీం ఆడవారిని శబరిమల ఆలయం ప్రవేశానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. తమకు 50ఏళ్లు నిండిన తర్వాతే స్వామిని దర్శించుకుంటామని కొందరు మహిళలు చెబుతున్నారు.

అయితే.. ఈ విషయంలో మళయాళం నటుడు కొల్లాం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల సందర్శనకు వచ్చే మహిళలను అడ్డంగా నరికేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహిళలను రెండు భాగాలుగా తెగనరికి ఓ భాగాన్ని ఢిల్లీకి పంపి, రెండో భాగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పార్శిల్ చేయాలంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. తులసి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.