గ్రాము పదార్థం తింటే.. కేజీ పండ్లు తిన్నట్టేనట!

ప్రస్తుతం ఉన్న తీవ్ర పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై ఎంతో దృష్టిసారిస్తున్నారు.శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Spirulina, Fruts, Spirulina Health Benfits, Iron, Zinc Vitamins, Immunity Power,-TeluguStop.com

మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడానికి కేజీ,కేజీలకు మించి పండ్లను తీసుకుంటున్నారు. పండ్లను అధికంగా తినడం ద్వారా ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయి అన్న ఉద్దేశంతో వాటిని తీసుకుంటున్నారు.

కానీ ఎవరికీ తెలియని అద్భుతమైన విషయం ఏమిటంటే? కేజీల ప్రకారం కాయలు తిన్నా అందని పోషకాలు ఈ పదార్థం కేవలం ఒక గ్రాము తింటే చాలు కేజీ పండ్లలో లభించే పోషకాలు ఈ గ్రాములో లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇంతకీ ఆ పదార్థం ఏమిటి? అవి ఎక్కడ లభిస్తాయో అన్న విషయాలను తెలుసుకుందాం.

భూమిపై తొలి ఆవిర్భావం గా భావించే స్పిరులినా అనే నాచు జాతికి చెందిన ఒక నీటి మొక్క.ఇది ఎన్నో పోషక విలువలతో కూడుకున్నది.ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్ మొదలైన పోషక విలువలు మరి ఏ ఇతర ఆహార పదార్థాలలో లభించనంత విరివిగా స్పిరులినా మొక్కలు లో లభిస్తాయి.వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న ఈ మొక్కను ఆదిమానవులు తమ ఆహారంలో ఒక భాగంగా తీసుకునేవారు.

అంతేకాకుండా ఎన్ని పోషక విలువలతో కూడిన ఈ మొక్కను ఇప్పటికీ ఇతర దేశాల ప్రజలు వారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు.ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ మొక్క ఎక్కువగా భారతదేశంలో లభించినప్పటికీ, దీని యొక్క ప్రాముఖ్యత భారతీయులకు చాలామందికి తెలియదు.

ఈ మొక్క ఆకులను ఎండబెట్టి ఆ పొడిని చిన్న గుళికల రూపంలో తయారు చేసుకుని ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న కాల్షియం దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఇందులో ఉన్న ఐరన్, జింక్, విటమిన్లు ఎంతో శ్రేష్ఠమైనవి పాలిచ్చే తల్లులు దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల బిడ్డ పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇందులో ఉన్న ప్రొటీన్ల పరిమాణం మరి ఏ ఇతర పదార్థాలలో కూడా లభించనంత అధికశాతంలో మనకు లభిస్తాయి శాకాహారులు ఈ స్పిరులీనా పదార్థాన్ని తీసుకోవడం ద్వారా మాంసంలో లభించే టటువంటి పోషక పదార్థాలు ఇందులో లభిస్తాయి.

ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కారక కణాలను నశింపజేస్తాయి.

మధుమేహంతో బాధపడేవారు ఈ స్పిరులినా మొక్కలను తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతుంది.అంతేకాకుండా మన శరీరంలో జీర్ణక్రియ రేటును మెరుగుపరచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఇంతటి పోషక విలువలు కలిగిన స్పిరులినా మొక్కను రోజుకు ఒక గ్రాము మాత్రమే తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరిచేరవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube