బరువు ఎత్తకపోతే కర్రతో వాతలు.. జిమ్ ట్రైనర్ పనిష్మెంట్

కరోనా( Corona ) తర్వాత ఫిట్‌నెస్‌పై చాలామంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బాడీని ఫిట్‌గా ఉంచుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.

 If You Don't Lift The Weight, You Will Be Beaten With A Stick Gym Trainer's Puni-TeluguStop.com

వ్యాయామం, యోగా లాంటివి చేస్తున్నారు.కొంతమంది ఇంట్లోనే వర్కౌట్లు, మెడిటేషన్( Workouts, meditation ) లాంటివి చేస్తోండగా.

మరికొంతమంది జిమ్‌లకు క్యూ కడుతున్నారు.దీంతో ప్రతీ వీధిలోనూ జిమ్ సెంటర్లు( Gym centers ) ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి.

ఎక్కడబట్టినా జిమ్ సెంటర్లు చిన్న చిన్న రూమ్‌లలో కూడా దర్శనమిస్తున్నాయి.ఒకప్పుడు సిటీలకే పరిమితమైన జిమ్ సెంటర్లు.

ఇప్పుడు పట్టణాలకు కూడా పాకాయి.

అయితే జిమ్ సెంటర్లలో ఉండే ట్రైనర్లు రకరకాల వర్కౌట్లు ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు.అనేక వర్కౌట్లను చెబుతూ ఉంటారు.అయితే ఒక జిమ్ ట్రైనర్ తన దగ్గర వర్కౌట్లు నేర్చుకుంటున్నవారికి వార్నింగ్ ఇచ్చాడు.210 కిలోల బరువు ఎత్తకపోతే కర్రతో తలపై కొడతానని హెచ్చరించాడు.హర్యానాలోని ఓ జిమ్‌లో ఈ సంఘటన జరగ్గా.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గబ్బర్( Gabbar ) అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు.

దీంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి బరువు ఎత్తడానికి ప్రయత్నం చేస్తోండగా.మరొక వ్యక్తి అతనికి సాయం చేస్తూ ఉంటాడు.ఇది చూసిన జిమ్ ట్రైనర్ వార్నింగ్ ఇచ్చాడు.

ఊపిరి పీల్చుకోండి.మీరు బరువు ఎత్తలేకపోతే నేను నిన్ను కొడతాను అంటూ చెప్పాడు.

ఈ రోజు మీరు 210 కిలోలు ఎత్తకపోతే జిమ్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని, తిరిగి జిమ్‌లోని రానివ్వనంటూ వార్నింగ్ ఇచ్చాడు.ఎత్తకపోతే మీ బ్యాగ్ తీసుకుని జిమ్ నుంచి బయలేదారాల్సి ఉంటుందని చెప్పాడు.

ఈ వీడియోపై నెటిజన్లు నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.జిమ్ ట్రైనర్ బాగా శిక్షణ ఇస్తున్నాడని, సిన్సియర్ ట్రైనర్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube