భార్యాభర్తలకు అదిరిపోయే పోస్టాఫీస్ స్కీమ్‌.. ఇలా చేస్తే ప్రతియేటా రూ.60 వేలు మీవే!

ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న భారతీయ ప్రజల కోసం ఇండియా పోస్ట్ ఎన్నో రకాల పథకాలు ఆఫర్ చేస్తోంది.కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్న ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి నష్ట భయం ఉండదు.

 If You Do This Post Office Scheme You Will Get Rs. 60,000 Per Year Wife, Husban-TeluguStop.com

దీనికితోడు గ్యారెంటీగా రిటర్న్స్ అందుకోవచ్చు.అయితే పోస్ట్ ఆఫీస్ ఆఫర్ చేస్తున్న అన్ని పథకాల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఆకర్షణీయంగా నిలుస్తోంది.

తాత్కాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనువైన పథకంగా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Post Office Monthly Income Scheme) నిలుస్తోంది.అయితే ఈ పథకం ద్వారా భార్యాభర్తలు ప్రతియేటా రూ.60 వేలు ఎలా సంపాదించాలో ఇప్పుడు చూద్దాం.

పోస్టాఫీస్‌ అందించే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో చేరి ప్రతి నెలా డబ్బులు అందుకోవచ్చు.

మూడు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా మీరు మీ డబ్బులు పొందొచ్చు.ఇందుకు మీరు ముందస్తుగా ఒకేసారి డబ్బులు పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.ఈ పథకం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు కాగా మీరు మీ పెట్టుబడి డబ్బంతా అందుకునేందుకు ఐదేళ్ల వరకు వేచి ఉండాలి.ఈ మెచ్యూరిటీ కాలంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ప్రతి నెలా వడ్డీ  లభిస్తూనే ఉంటుంది.

Telugu Latest, Scheme-Latest News - Telugu

కేవలం వెయ్యి రూపాయలతోనే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.గరిష్ట పెట్టుబడి పరిమితిని రూ.4.5 లక్షలుగా నిర్ణయించారు.ఈ పరిమితి అనేది ఒక వ్యక్తికే వర్తిస్తుంది.అయితే ఈ పథకంలో జాయింటు  అకౌంట్ తెరిస్తే మాత్రం రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.ప్రస్తుతం పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డిపాజిట్ చేసే మొత్తంపై 6.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.స్మాల్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది.

అందువల్ల ఈ వడ్డీ రేట్లు మారే అవకాశం ఉందని గమనించాలి.భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ పథకంలో జాయింట్ అకౌంట్ తెరిచి రూ.9 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే ప్రతియేటా రూ.60 వేల వరకు పొందవచ్చు.అంటే నెలకు రూ.5 వేల వరకు భార్యాభర్తలిద్దరూ పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube