అలా చేస్తే షర్మిల కష్టం.. వృధా !

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల( YS Sharmila ) గురించిన ప్రస్తావన తరచూ వినిపిస్తూనే ఉంది.షర్మిల తన పార్టీని కాంగ్రెస్ ( Congress )లో విలీనం చేయబోతుందని, లేదా రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని, లేదా ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపడం ఖాయమని.

 Is Sharmila Fully Clear About That Details, Ts Political News,telugu Latest News-TeluguStop.com

ఇలా రకరకాల వార్తలు ఈ మద్య చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపించాయి.

ఈ రకమైన వార్తలు రావడానికి కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సత్సంబంధాల కారణంగాఈ వార్తలు బలంగా వినిపించాయి.

Telugu Alliancets, Congress, Sharmila, Sharmila Latest, Telugu Latest, Ts, Ts Ys

ఇక వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా ఆమె పార్టీ.ఏదో ఒక పార్టీతో పొత్తు( Party alliance ) పెట్టుకునే అవకాశం ఉందనే వాదనలు కూడా గట్టిగా వినిపించాయి.బిజెపి, కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్( BJP,Congress,BRS ) వంటి ప్రధాన పార్టీల నేతలు కూడా ఆమెతో మంతనాలు చేస్తున్నారనే టాక్ వినిపించింది.అయితే ఆ వార్తలన్నిటిని షర్మిల ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.

తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని, ఎన్నికల బరిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చాలా సార్లు స్పష్టం చేశారు.ఇప్పుడు మరోసారి ఈ రకమైన వార్తలపై స్పందించారు షర్మిల.

తాన పార్టీని మరోపార్టీలో విలీనం చేయడం జరగదని, ఒక మహిళా కష్టాన్ని అవమానించవద్దని చెప్పుకొచ్చారు.తానే సొంతంగా అభ్యర్థులను తయారు చేసుకొని ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.

Telugu Alliancets, Congress, Sharmila, Sharmila Latest, Telugu Latest, Ts, Ts Ys

ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పిన ఆమె.పొత్తుల విషయంలో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలు కూడా క్లారిటీ ఇవ్వాలని సూచించింది.కాగా ప్రస్తుతం షర్మిల చేస్తున్న ఒంటరి పోరాటం వల్లనే ఆమెకు గుర్తింపు లభిస్తుందనేది కొందరి అభిప్రాయం.ఆమె ఏ పార్టీకి మద్దతు తెలిపిన పార్టీ బలోపేతం కోసం ఇన్నాళ్ళు ఆమె పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందనేది ఎవరు కాదనలేని వాస్తవం.

ఇదిలా ఉంచితే ప్రస్తుతం షర్మిల పార్టీకి రాష్ట్రంలో ఎంతమేర ఆధారణ ఉందనే దానిపై కూడా రకరకాల అభిప్రాయాలూ తెరపైకి వస్తున్నాయి.షర్మిల పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపకపోవచ్చని కొందరు చెబుతుంటే.

మరికొందరేమో కనీసం 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.అయితే షర్మిల చెబుతున్నా దాని ప్రకారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 40-50 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందట.

మరి షర్మిల పార్టీ తెలంగాణలో ఎంతమేర ప్రభావం చూపుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube