ఆ చేప బాగుందని పట్టుకున్నారో మీ ప్రాణాలు హరీ అనాల్సిందే..!

చేపలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.అయితే కొంత మంది చేపలను తింటారు.

 If You Catch That Fish Is Good, Your Lives Will Be Ruined Fish, Weired Fish, Lat-TeluguStop.com

కొంత మంది చిన్నవిగా, అందంగా ఉంటే ఆక్వేరియంలో పెంచుకుంటూ వాటిని చూస్తూ ఆనందిస్తారు.అయితే కొన్ని చేపల్ని తినగలము, కొన్నిటిని ఆక్వేరియంలో పెంచుకుంటాము.

కానీ సముద్రంలో నివసించే కొన్ని రకాల చేపలను తినలేము.అలా అని ఆక్వేరియంలో పెంచుకోనూలేము.

వాటిల్లో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి.అవి కరిచినప్పుడు మనుషుల్లో వివిధ ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

ఒకవేళ ఆ విషం ఎక్కువ మోతాదులో ఒంట్లో చేరితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు రావొచ్చు.అలాంటి వాటిల్లో ఒ,కటి లయన్ ఫిష్.

ఈ చేపలు అందంగా ఉంటాయి.విచ్చుకున్న మందారాళ్ల, రంగురంగుల గాలి పటాల్లా చూడగానే ఎవరికైనా ఇట్టే నచేస్తాయి.

ఊదా, ఎరుపు, నలుపు, నీలం ఇలా అనేక రంగుల్లో చారల డిజైన్లలో ఆకట్టుకునేలా ఉంటాయి.ఇవి అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో తీర ప్రాంతాలు, కరీబియన్ సముద్రంలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

కానీ.ఒక్కోసారి మిగతా సముద్రంలోకి కూడా ఇవి చేరుకుంటాయని, వీటి గురించి తెలియని ప్రజలు వాటిని పట్టుకోడానికి ప్రయత్నించి ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

చూడ్డానికి చిన్నవిగా కనిపించినా ఈ చేపల్లో తాచుపాములో ఉండేంత విషయం దాగి ఉంటుంది.ఒకవేళ ఎవరైనా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినా, ఆపద అనిపించినా తన స్టింగ్స్ తో ఎదుట ఉన్న జీవి ఏదైనా కాటేస్తుంది.

దాని స్టింగ్ ద్వారా ఎదుటి జీవి ఒంట్లోకి విషం చేరి ప్రాణాలు హరిస్తుంది.ఒకవేళ చేపలు లాంటివి అయితే అక్కడే చనిపోతాయి.

అదే మనుషులను కాటేస్తే శ్వాసకోస సమస్యలు ఏర్పడతాయి.కాటేసిన ప్రాంతంలో విష ప్రభావంతో చర్మమంతా ఉబ్బిపోతుంది.

అక్కడ స్పర్శ కూడా కోల్పోతారు.

Telugu Fish, Latest, Weired Fish-Latest News - Telugu

ఒక్కసారి కాటేస్తే కేవలం ఈ సమస్యలు మాత్రమే వస్తాయి, కానీ రెండుకు మించి ఎక్కువసార్లు కాటేస్తే మాత్రం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.అందుకే లైన్ ఫిష్ ను ప్రమాదకరమైన జీవుల జాబితాలో కలిపేశారు శాస్త్రవేత్తలు.చాలా మందికి చేపలు పట్టడం ఆసక్తిగా ఉండడంతో బ్రిటన్ లాంటి దేశాల్లో వారాంతంలో చేపలు పట్టడానికి వెళ్తారు.

అలా చేపలు పట్టే ప్రయత్నంలో లయన్ ఫిష్ బారినపడిన వారు చాలా మంది ఉన్నారు.అందుకే లైన్ ఫిష్ కనిపించే తీరప్రాంతాల్లో ఆయా దేశ ప్రభుత్వాలు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube