బీజేపీని న‌మ్ముకుంటే జ‌గ‌న్‌కు చిక్కులు త‌ప్ప‌వా..

ఏపీలో ఇప్పుడు వైసీపీకి తిరుగులేద‌న్న విష‌యం తెలిసిందే.2019 ఎన్నికల్లో అత్య‌ధిక మెజార్టీ దాదాపు ఆంధ్ర ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఎవ‌రికీ లేనంత మెజార్టీని క‌ట్ట‌బెట్టి మ‌రీ అధికారాన్ని అప్ప‌జెప్పారు ఏపీ ప్ర‌జ‌లు.అప్ప‌టి నుంచే వైసీపీ ఏది చేసినా కూడా ప్ర‌జ‌ల్లో మాత్రం పెద్ద‌గా వ్య‌తిరేక‌త అనేది క‌నిపించ‌ట్లేదు.ఇది జ‌గ‌న్‌కు బాగా క‌లిసి వ‌చ్చే అంశ‌మ‌నే చెప్పాలి.ఇక అటు ఎంపీ సీట్ల ప‌రంగా కూడా వైసీపీకి భారీ మెజార్టీ ఉంది.22 మంది ఎంపీలు ఉండ‌టంతో కేంద్రంలో మంచి ప‌ట్టు దొరికిన‌ట్టు అయింది జ‌గ‌న్‌కు.అయితే ఆయ‌న మాత్రం ఇంకా బీజేపీనే న‌మ్ముకుంటున్నారు.

 If You Believe In Bjp, There Will Be Implications For Jagan.., Jagan, Bjp-TeluguStop.com

ఇంత భారీ మెజార్టీ, ప్ర‌జ‌ల్లో తిరుగులేని ఆద‌ర‌ణ ఉన్నా కూడా ఆయ‌న మాత్రం బీజేపీకి వ్య‌తిరేకంగా ఏనాడూ మాట్లాడ‌ట్లేదు.

ఇందుకు కార‌ణం ఆయ‌న మీద ఉన్న పలు కేసులేన‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి.దాదాపు కొన్నేండ్ల నుంచి ఆ కేసుల మీద విచారణ కొన‌సాగుతూనే ఉంది.ఈ కార‌ణ‌ల‌తోనే బీజేపీ చేప‌డుతున్న కొన్ని ప్రజా వ్య‌తిరేక విధానాల మీద జగన్ బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారనే విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే అనేకం వినిపిస్తున్నాయి.అయితే ఇది చివ‌ర‌కు జ‌గ‌న్‌కు చిక్కులు తెచ్చిపెడుతోంద‌ని అనిపిస్తోంది.

Telugu Ap, Ap Politicals, Bjp, Jagan, Ysrcp-Telugu Political News

ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రంలో ఎవ‌రు గెలిచినా వారి మెడ‌లు వంచి మ‌రీ స్పెష‌ల్ స్టేట‌స్ సాధిస్తామ‌ని చెప్పారు.కానీ గెలిచాక ఆ ఊసే ఎత్త‌ట్లేదు.ఇక దేశంలో నిత్యావసర వ‌స్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్ ధరలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నా స‌రే జ‌గ‌న్ మాత్రం ఏనాడూ వీటిపై స్పందించ‌ట్లేదు.

ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలోనూ బీజేపీ వైసీపీకి షాక్ ఇస్తోంది.దీనిపై కూడా జ‌గ‌న్ పెద్ద‌గా మాట్లాడ‌ట్లేదు.దీన్నే అటు టీడీపీ టార్గెట్ చేస్తోంది.జ‌గ‌న్ మౌనం బీజేపీకి స‌పోర్టు అని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు.

పైగా చంద్ర‌బాబు కూడా ఇప్పుడు బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇక అమిత్ షా స్వయంగా చంద్ర‌బాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వ‌డాన్ని బ‌ట్టి చూస్తే టీడీపీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

ఇలాగే జ‌గ‌న్ బీజేపీని న‌మ్ముకుంటే మాత్రం చివ‌ర‌కు ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు విశ్లేష‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube