ప్యాకెట్‌ పాలు వాడుతున్నారా... అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి

పెరుగుతున్న జనాబా, తగ్గుతున్న రోజు వారి అవసరాల సరుకుల ఉత్పత్తి కారణంగా కల్తీ అనేది మొదలవుతోంది.కల్తీ సరకులతో ప్రతి రోజు మనం నానా ఇబ్బందులు పుడుతూనే ఉన్నాం.

 If You Are Using Milk Packet Read This-TeluguStop.com

ప్రతి రోజు కల్తీ ఆహారం తీసుకుంటున్నాం.సామాన్యులు ఏదో ఒక రకంగా ప్రతి రోజు కల్తీ బారిన పడుతున్నారంటూ తాజాగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

ముఖ్యంగా ఇండియాలో కత్తీ సామ్రాజ్యం మరీ పెరిగి పోతుంది.ఏదైనా ఒక వస్తువుకు అచ్చు దానిలాగే ఉండే కల్తీ తయారు అవుతుంది.

అది చిన్న పిల్లలు తాగే పాలకు కూడా వ్యాప్తి చెందింది.ముఖ్యంగా పాకెట్‌ పాలను తాగే పరిస్థితి లేకుండా అవుతోంది.

ప్యాకెట్‌ పాలు అంటూ ఏ రసాయనాలు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి.ప్రముఖ కంపెనీ పేరు చెప్పి నకిలీ పాలను అమ్మేస్తున్నారు.అందుకే పాల ప్యాకెట్‌ కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.పిల్లలకు పట్టే పాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రముఖ కంపెనీ తయారు చేసిన పాల ప్యాకెట్లను మాత్రమే తీసుకోవాలి.ప్రముఖ కంపెనీ పేరులో చిన్న మార్పు చేసి నకిలీ పాలు వస్తాయి.

అచ్చు కవర్‌ అదే విధంగా ఉంటుంది, కాని కంపెనీ పేరులో మాత్రం ఒక్కటి రెండు అక్షరాలు తేడాగా ఉంటాయి.వాటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్యాకెట్‌ పాలు వాడుతున్నారా

ప్యాకెట్‌లపై తేదీ మరియు కంపెనీ వారి హోలోగ్రామ్‌ ఉందా అనేది సరిగా చెక్‌ చేసుకోవాలి.పాల ప్యాకెట్‌ మూడు నాలుగు రోజులకు మించి ఎక్కువగా ఉండవు.అందుకే ఆలోపు మీ వద్దకు వస్తే పర్వాలేదు, లేదంటే ఆ పాల ప్యాకెట్‌లను తీసుకోకుండా ఉండటం బెటర్‌.ఇక పాల ప్యాకెట్‌ను ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత దాన్ని అలాగే ఫ్రిజ్‌లో పెట్టడం జరుతుంది.

లేదంటే కొందరు కట్‌ చేసి అలాగే పాలు బౌల్‌ లో పోస్తారు.కాని అలా చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.

ప్యాకెట్‌ కవర్‌ ను శుభ్రంగా కడగాలి.కడిగిన తర్వాత కట్‌ చేసి పాలు వాడుకోవడం లేదంటే ఫ్రిజ్‌లో పెట్టడం చేయలి.

పాల ప్యాకెట్‌ను ట్రేల్లో పెడతారు.ఆ ట్రేలను శుభ్రం చేయకుండా ఉండటంతో పాటు, కొన్ని సార్లు ఇరిగిన పాలతో కూడా ట్రే ఉంటుంది.

అందులోంచి తీసుకు వచ్చిన ప్యాకెట్‌ను నేరుగా ఫ్రిజ్‌లో పెడితే దుర్వాసన రావడంతో పాటు ఇరిగి పోయే ప్రమాదం ఉంది.అందుకే పాల ప్యాకెట్‌ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube