పిల్లల పేరుతో బ్యాంకు ఖాతా తెరుస్తున్నట్టయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి సుమా!

పిల్లలకు చిన్నతనం నుంచే బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రాథమిక విషయాలను నేర్పించడం అనేది చాలా అవసరం.అలా చేయడం వలన వారు బ్యాంకు డిపాజిట్‌, విత్‌డ్రా, డెబిట్‌ కార్డు వినియోగం వంటి పలు విషయాల గురించి పిల్లలు చిన్నతనంలోనే నేర్చుకోగలుగుతారు.

 If You Are Opening A Bank Account In The Name Of A Child , You Must Know These-TeluguStop.com

అలాగే, ఖర్చులు అదుపులో ఉంచుకుని పొదుపును ఏవిధంగా పెంచుకోవాలో, అవసరమైనపుడు ఎలా ఖర్చు చేయాలో తెలుసుకుంటారు.ఒకవేళ మీరు పిల్లలకు బ్యాంకు ఖాతా తెరిచి ఇచ్చేందుకు బ్యాంకును సంప్రదిస్తుంటే.ముందుగా ఈ విషయాలను తెలుసుకోవాలి.

18 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న వారిని బ్యాంకులు మైన‌ర్లుగా ప‌రిగ‌ణిస్తాయి.అటువంటి వారి పేరుపై తెరిచే ఖాతాలను మైనర్‌ ఖాతాల వర్గంలో చేర్చుతారు.10 ఏళ్లపైన, 18 సంవత్సరాల్లోపు పిల్లల పేరుపై తెరిచే బ్యాంకు ఖాతాను పిల్లలే స్వయంగా నిర్వహించుకోవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకుడితో కలిసి ఖాతాను నిర్వహించాలి.18 ఏళ్లు దాటిన తర్వాత మైనర్‌ ఖాతాను సాధారణ పొదుపు ఖాతాగా మారుస్తారు.డెబిట్‌ లేదా ఏటీఎం కార్డు, చెక్‌బుక్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి పలు సదుపాయాలు బ్యాంకులు మైనర్‌ ఖాతాలకు అందిస్తున్నాయి.

 If You Are Opening A Bank Account In The Name Of A Child , You Must Know These-TeluguStop.com

పిల్లల పేరుపై ఖాతా తెరిచినప్పుడు, వారి చేతే ఖాతాలో నగదు జమ చేయించడం, విత్‌డ్రా చేయించడం.వాటికి సంబంధించిన ఫారంలను దగ్గరే ఉండి వారికి పరిచయం చేస్తే మంచింది.ఆ తర్వాత అవి పాస్‌ పుస్తకంలో ఏవిధంగా, ఎక్కడ ప్రింట్ చేయబతాయో తెలియజేయాలి.

కొన్ని బ్యాంకులు ఫోటో ఏటీఎం కార్డులను జారీ చేస్తుంటాయి.కాబట్టి మీ పిల్లలకు ఏటీఎం కార్డు ఇచ్చేటప్పుడు.

కార్డును సురక్షితంగా ఎలా ఉపయోగించాలో చెప్పండి.కనీసం మూడు నుంచి నాలుగు సార్లైనా మీ సమక్షంలో లావాదేవీలు చేసేలా చూడండి.

నెట్‌ బ్యాంకింగ్‌ విషయం లోనూ భద్రతా నియమాలు పాటించేలా చూడండి.

If You Are Opening A Bank Account In The Name Of A Child , You Must Know These Things, Kids, Viral Latest, News Viral, Latest News, Bank Tips, Account, Opening - Telugu Bank Tips, Latest #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube