మీరు ఎక్క‌బోయే రైలు రాత్రి పూట ఉంటే.. ఈ నియ‌మాలు మీ కోస‌మే..

రైలులో ప్రయాణించేటప్పుడు, మీరు అనేక నియమాలను పాటించాలి.టీటీఈ ల విషయంలో కూడా ఇలాంటి నియ‌మాలే ఉంటాయి.

 If You Are Boarding A Train At Night .. These Train Are For You People Tte India-TeluguStop.com

రాత్రివేళ‌ రైలులో ప్రయాణించేటప్పుడు టీటీఈ టిక్కెట్లను పదే పదే తనిఖీ చేయడం వల్ల నిద్రపోలేకపోతున్నామ‌ని ప్ర‌యాణీకులు ఫిర్యాదు చేస్తుంటారు.అయితే ఇటువంటి స‌మ‌స్య మీకు రాకూడ‌ద‌నుకుంటే కొన్ని నియ‌మాలు పాటించాలి.

అవేమిటో ఇప్పుడు చూద్దాం.వీటిని పాటిస్తే రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు.

వారు టిక్కెట్లు తనిఖీ చేయడానికి, ఐడీ అడ‌గ‌డానికి రాత్రి 10 గంటల తర్వాత మిమ్మ‌ల్ని లేప‌రు.ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి 10 గంటల లోపు టీటీఈ ఈ పని చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు, మీ రైలు రాత్రి 8 గంటలకు ఉందనుకోండి, అప్పుడు టీటీఈ రాత్రి 10 గంటలలోపుగానే మీ టిక్కెట్‌ని తనిఖీ చేస్తారు.అయితే కొన్ని ప్రత్యేక మరియు అత్యవసర కారణాలు ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవచ్చు.

మీరు 10 గంటల తర్వాత రైలు ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఈ నియమం వర్తించదు.అంటే రాత్రి 10 గంటల తర్వాత రైలులో కూర్చున్న ప్రయాణికుల టిక్కెట్లను రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే టీటీఈ త‌నిఖీ చేస్తారు.

రాత్రి వేళల్లో రైలు ప్రయాణీకులు టీటీఈకి టికెట్‌, ఐడీ చూపించాల్సి ఉంటుంది.రైల్వే నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్‌లో ఉన్న ప్రయాణికుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తన బెర్త్‌లో పడుకోవచ్చు.

ప్రయాణీకుడు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటలలోపు కింద‌కు దించితే అత‌నిని అడ్డుకోవ‌చ్చు.అలాగే ఉదయం 6 గంటల తర్వాత మిడిల్ బెర్త్‌ను ఎత్తివేయాలి.చాలా జోన్లలో న‌డిచే రైళ్లలో రాత్రి 11 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.అందుకే రాత్రి ప్రయాణించేవారు 11 గంటల లోపు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టుకోవాలి.

చాలా రైళ్లలో నైట్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో లేదు.

Night Train Rules TTE cannot Check Ticket While you Sleeping

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube